E-Paper
Advertisement

మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఇష్యూ, కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేంద్ర ఎన్నికల సంఘంతో నేతలు భేటీ

మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఇష్యూ, కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేంద్ర ఎన్నికల సంఘంతో నేతలు భేటీ
Advertisement

Delhi: దేశంలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఇదంతా కావాలనే బీజేపీ ఆడుతున్న ఓట్ చోరీ నాటకంగా వర్ణించింది. ఈ నేపథ్యంలో బుదవారం మధ్యాహ్నాం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు ఆ పార్టీ నేతలు.

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం

Advertisement

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు ఆ పార్టీలు. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.

కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంపై ఎన్నికల సంఘంతో చర్చించనుంది కాంగ్రెస్ ప్రతినిధుల బృందం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రాంతాల్లో రాత్రి ఆందోళనకు దిగింది. డెమోక్రటిక్ హైజాక్ అంటూ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క సీటును బలవంతంగా లాక్కోవడానికి చేసిన కుట్రగా వర్ణించింది ఆ పార్టీ.

Advertisement

కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేంద్ర ఎన్నికల సంఘంతో నేతలు భేటీ

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు జరగాల్సిన ఎన్నికను ఏకపక్షంగా మార్చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలు. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఒక సీటును దక్కించుకునేందుకు అధికార బీజేపీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు.  మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని బుధవారం మధ్యాహ్నం కలుస్తున్నట్లు నేతలు తెలిపారు.

తమ అభ్యంతరాలను, ఆధారాలను సీఈసీ సమర్పించనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈసీఐ నిబంధనల ప్రకారం.. కోర్టు నిర్దిష్టమైన అభియోగాలు నమోదు చేసినప్పుడు వాటిని అఫిడవిట్‌లో వెల్లడించాలని, నోటీసు దశలో ప్రకటించాల్సిన అవసరం లేదని వాదిస్తోంది ఆ పార్టీ నేతలు.  మీనాక్షీ నటరాజన్ ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, ఆమెపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ.

ALSO READ: దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో, భారత్‌పై దాని ప్రభావం ఎంత? కరువు తప్పదా?

బీజేపీపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత భూపేష్‌బఘేల్.  మధ్యప్రదేశ్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ దాఖలు చేసేందుకు మాకు సాయంత్రం 5.30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. ఎన్నికల సంఘం కార్యాలయం సాయంత్రం 5.30 గంటలకు మూసివేస్తారని గుర్తు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం అసంతృప్తిగా ఉంటే మా దరఖాస్తును భారత ఎన్నికల సంఘానికి సమర్పించాలన్నారు.

మేము కోర్టుకు వెళితే, ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళమని చెబుతోందన్నారు. మా దరఖాస్తు ఇక్కడ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. ఇందుకోసం ధర్నాకు కూర్చోవాల్సి వచ్చిందని, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఎవరూ వినడానికి సిద్ధంగా లేరన్నారు.

రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండగా అవకతవకలు జరిగితే ఫిర్యాదులు మాకే వస్తాయని ఎన్నికల సంఘానికి తెలిసినప్పటికీ, ఆఫీసు సాయంత్రం 5.30 గంటలకు మూసివేశారని అన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? మొదట్లో అధికారులు మమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదని, మేము ధర్నాకు కూర్చున్నప్పుడు మాకేదో ఉపకారం చేస్తున్నట్లుగా దరఖాస్తులు సమర్పించడానికి అనుమతించారని వివరించారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×