E-Paper
Advertisement

Bengaluru Stampede: అంతా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌దే బాధ్యత .. తొక్కిసలాటపై ముఖ్యమంత్రి స్పందన

Bengaluru Stampede: అంతా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌దే బాధ్యత .. తొక్కిసలాటపై ముఖ్యమంత్రి స్పందన
Advertisement

Bengaluru Stampede| బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఐపిఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 47 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం స్పందిస్తూ.. ఈ దుర్ఘటన వల్ల గెలుపు సంతోషం ఆవిరైపోయిందని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

సిద్దరామయ్య ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయి. ఈ ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఆ భయనక ఘటనలో 30 మంది మరణించారు, 60 మంది గాయపడ్డారు. నేను ఈ ఘటనను సమర్థించడం లేదు, కానీ ఇలాంటివి గతంలోనూ జరిగాయి,” అని అన్నారు. ఈ ఘటనకు అసలు కారణం స్టేడియంలో ఉన్న సామర్థ్యం కంటే ఎక్కువ మంది దూసుకురావడం. స్టేడియంలో 35,000 మంది సామర్థ్యం మాత్రమే ఉండగా.. దాదాపు 2-3 లక్షల మంది అభిమానులు దూసుకు వచ్చారు. ఇంత పెద్ద జనసమూహాన్ని ఎవరూ ఊహించలేదని ఆయన తెలిపారు.

Advertisement

స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల కార్యక్రమం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటన ఈ కార్యక్రమంలో జరిగింది. అందుకే ఈ దుర్ఘటనకు క్రికెట్ అసోసియేషన్ దే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వంది కాదని సిద్దరామయ్య స్పష్టం చేశారు. “ప్రభుత్వం కేవలం అనుమతి ఇచ్చింది. బెంగళూరు పోలీసులను భద్రత కోసం మోహరించింది. స్టేడియంలో కార్యక్రమాన్ని మేము నిర్వహించలేదు,” అని ఆయన అన్నారు. విధానసౌధ (కర్ణాటక అసెంబ్లీ) వద్ద ఆర్సీబీ విజయోత్సవాల పరేడ్ ప్రారంభమైంది. అక్కడ లక్ష మందికి పైగా గుమిగూడినప్పటికీ ఎలాంటి ఘటనా జరగలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్టేడియం సమీపంలో ఒక డ్రైన్‌పై ఉన్న తాత్కాలిక స్లాబ్‌పై జనం బరువుతో కూలిపోవడం వల్ల భయాందోళన ఏర్పడి, తొక్కిసలాట జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో 47 మంది గాయపడ్డారని, చాలా మందికి స్వల్ప గాయాలే అయినందున వారు ఆసుపత్రిలో చేరలేదని, అందరూ ప్రమాదం నుండి బయటపడ్డారని సిద్దరామయ్య తెలిపారు.

Advertisement

మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. “ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం,” అని ఆయన అన్నారు.

Also Read: ఒంటరి పోరాటం.. ఐపిఎల్ ఫైనల్లో ఆర్సీబీకి దడ పుట్టించిన ఒకే ఒక్కడు

ఆర్సీబీ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు గేట్ల వద్ద తోపులాడడంతో ఈ దుర్ఘటన జరిగిందని, భద్రత కోసం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిద్దరామయ్య కోరారు. ఈ ఘటన ఆర్‌సిబి విజయోత్సవాలను దుఃఖంలో ముంచెత్తిందని, ప్రజలు జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×