E-Paper
Advertisement

Chennai banned chemicals seized: చెన్నైలో సీజ్.. చైనా నుంచి పాక్‌‌కి డేంజర్ కెమికల్స్..

Chennai banned chemicals seized: చెన్నైలో సీజ్..  చైనా నుంచి పాక్‌‌కి డేంజర్ కెమికల్స్..
Advertisement

Chennai banned chemicals seized: పాకిస్థాన్‌ జీవాయుధాలు తయారు చేస్తోందా? చైనా నుంచి పాక్‌కు నిషేధిత రసాయనాలకు ఎందుకు తరలిస్తోంది? అంతర్జాతీయంగా నిషేధం ఉన్నవాటిని ఎందుకు పంపిస్తోంది? ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 18న చైనాలోని షాంఘై నౌకాశ్రయంలో కమర్షియల్ షిప్ ఒకటి పాకిస్థాన్‌కు బయలుదేరింది. అందులో చైనాకు చెందిన ఓ సంస్థ పాకిస్థాన్‌కు ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్ డేంజర్ కెమికల్స్‌ను తరలించింది. దాదాపు 2560 కిలోల సరకును 103 డ్రమ్ముల్లో నింపింది. ఆ నౌక మే 8న తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు చేరింది.

Advertisement

నార్మల్‌గా పోర్టుకు ఏ తరహా షిప్‌లు వచ్చినా కచ్చితంగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తారు. ఇందులోభాగంగా కెమికల్స్‌ను గుర్తించారు. నిపుణుల సాయంతో దీన్ని పరీక్షించారు. అందులో ఉన్నవి డేంజర్ కెమికల్స్ అని తేలడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాస్సెనార్ అరేంజ్‌మెంట్ కింద ఎగుమతిపై ఆంక్షలు ఉన్నాయి.

ALSO READ: సుప్రీం కోర్టు బెయిల్ మంజూర్ చేసినా.. జైలులోనే కేజ్రీవాల్.. ఎందుకంటే?

Advertisement

ఈ కెమికల్స్‌ను టియర్ గ్యాస్ తయారీలో ఉపయోగిస్తారు. ఇదికాకుండా ప్రమాదకర ఆయుధాలకు వాటిని ఉపయోగించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా దానిపై నిషేధం ఉంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. గతేడాది మార్చిలో చైనా నుంచి ఓ నౌక పాకిస్తాన్ కు వెళ్తోంది. ఆ షిప్ ముంబై పోర్టుకు చేరుకోగానే అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేశారు. అందులో అణు కార్యక్రమంలో వినియోగించే సరకును తరలిస్తున్నారనే సమాచారంతో దాన్ని నిలిపివేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×