E-Paper
Advertisement

Modi – Putin: ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ.. పుతిన్‌కు ప్రధాని మోదీ ఆలింగనం

Modi – Putin: ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ.. పుతిన్‌కు ప్రధాని మోదీ ఆలింగనం
Advertisement

Modi – Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి చేరుకున్నారు. దిల్లీ శివార్లలో ఉన్న పాలం ఎయిర్‌ పోర్టులో దిగిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. మోదీ తన భద్రత నియమాలు పక్కన పెట్టి, పుతిన్ వద్దకు వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఇరు దేశాధినేతల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను తెలియజేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత పుతిన్ దిల్లీకి రావడం విశేషం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఆయన విదేశీ పర్యటన ఇది మొదటిది. ఆయన పర్యటనలో భాగంగా భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీలో మోదీతో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

Advertisement

భారత్ సంబంధాలు, సహకారం మరింత పెంచడానికి రష్యా ఉత్సాహం చూపిస్తుందని పుతిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇరు దేశాలు ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయ రంగాలలో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాయి. రక్షణ సహకారం గురించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాక, భారతదేశం నుంచి దిగుమతులు మరింత పెంచే విషయంపై చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఈ సమావేశాలు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రధాని మోదీ ట్వీట్..

Advertisement

భారతదేశానికి విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. పుతిన్‌ను తన స్నేహితుడిగా పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

‘నా మిత్రుడు అధ్యక్షుడు పుతిన్‌కు భారతదేశంలో స్వాగతం పలకటం సంతోషకరం. ఈ రోజు, రేపు జరిగే మా సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్‌లో తెలిపారు.

భారతదేశం రష్యా మైత్రి చిరకాలంగా నిరూపితమైందన్నారు. ఈ స్నేహం ఇరు దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఆయన చెప్పారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇద్దరు నాయకులు రక్షణ, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ALSO READ: Sarpanch Elections: పంచాయతీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్.. సర్పంచ్‌గా ఎమ్మెల్యే భార్య పోటీ

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×