E-Paper
Advertisement

Red Hair: మీకు ఎర్రరంగు జుట్టు ఉందా? అయితే మీకు గాయాలు తగిలితే ఏమవుతుందో తెలుసా?

Red Hair: మీకు ఎర్రరంగు జుట్టు ఉందా? అయితే మీకు గాయాలు తగిలితే ఏమవుతుందో తెలుసా?
Advertisement

కొత్త పరిశోధన ఎర్ర జుట్టు ఉన్న వ్యక్తుల గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. చాలామంది జుట్టు రంగు అంటే కేవలం అందం, వంశం, లేదా జెనెటిక్ లక్షణం అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం ఎర్ర జుట్టుకు కారణమయ్యే MC1R అనే జన్యువుకు శరీరం గాయాలకు ఎలా స్పందిస్తుందన్నది నిర్ణయిస్తుందని అధ్యయనం చెబుతోంది. ఈ జీన్‌లో ఉండే ప్రత్యేక మార్పులు ఎర్ర జుట్టు ఉన్నవారిని ఇతరులతో పోలిస్తే కొంచెం భిన్నంగా మారుస్తాయి. గాయాలు తగిలినప్పుడు సాధారణ జుట్టు ఉన్నవారికి నొప్పి అధికంగా అనపిస్తుంది. కానీ ఎర్ర జుట్టు ఉన్న వారికి గాయాల నొప్పి తక్కువగా అనిపిస్తుందట. గాయం తీవ్రంగా ఉన్నా కూడా నొప్పి అంతగా ఉండకపోవడం వలన వారు ఆ గాయాన్ని కొన్నిసార్లు గుర్తించరు కూడా.ఇది కొన్నిసార్లు ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఎర్రజుట్టు ఎంతో ప్రత్యేకం
ఈ స్టడీ ప్రధానంగా గాయాలు తగ్గ విషయంపైనే దృష్టి పెట్టింది. ఎర్ర జుట్టు ఉన్నవారి శరీరం గాయాన్ని మానిపించే సమయంలో సహజంగా జరిగే ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియ కొంచెం ఎక్కువ రోజులు కొనసాగవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా గాయం తగిలినప్పుడు శరీరం దానిని సరిచేయడానికి వాపు, ఎరుపు, నొప్పి వంటి ప్రతిచర్యలను చూపిస్తుంది. కానీ ఎర్ర జుట్టు ఉన్నవారిలో ఈ వాపు ఎక్కువ కాలం వరకు రాదు. దీంతో గాయం పూర్తిగా మానిపోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఇది చిన్న గాయం అయినా ఇన్ఫెక్షన్‌కు అవకాశాలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు కారణం కూడా MC1R జన్యువు కారణం. ఈ జన్యువుకు చర్మ కణాలు, ఇమ్యూన్ సిస్టమ్‌ మధ్య జరిగే సంకేతాలను ప్రభావితం చేస్తుందని అధ్యయనం పేర్కొంటోంది.

Advertisement

గాయం పెద్దదైనా నొప్పిరాదు
ఎర్ర జుట్టు ఉన్నవారి నొప్పి గ్రహణ శక్తి ఇతరుల కంటే చాలా సున్నితంగా లేదా కొంత తక్కువగా ఉండొచ్చు. అంటే గాయం ఎంత పెద్దదైనా వారికి నొప్పి ఎక్కువగా అనిపించకపోవచ్చు. గాయం తీవ్రంగా ఉన్నా కూడా నొప్పి కలగకపోవడం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశముంది. పరిశోధకుల మాటల్లో, చిన్న గాయాన్నైనా సరిగ్గా శుభ్రం చేయకపోతే అది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. నొప్పి తగ్గి ఉండటం వల్ల పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఎక్కువ. అందుకే ఎర్ర జుట్టు ఉన్నవారు చిన్న గాయమైనా జాగ్రత్తగా చూసుకోవాలి. గాయం రంగు మారుతుందా? వాపు పెరుగుతుందా అని గమనించాలి అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఈ అధ్యయనం ఎర్ర జుట్టు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం లేదు. కానీ వారు గాయాల విషయంలో కొంచెం అదనంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నదే ఈ స్టడీ సందేశం. ఏదైనా గీత, కాలిన గాయం వచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి, యాంటీబయాటిక్ క్రీమ్ పెట్టడం, గాయం వాపు తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. నొప్పి లేకపోవడం వల్ల గాయం చిన్నదని భావించ కూడదు. ఈ పరిశోధన మన శరీరం ఎలా పని చేస్తుంది, చిన్న చిన్న జెనెటిక్ మార్పులు కూడా ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని ఆసక్తికరంగా బయటపెడుతోంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×