E-Paper
Advertisement

Bijapur Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Bijapur Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Advertisement

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవీ ప్రాంతంలో.. మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. బుధవారం ఉదయం ప్రత్యేక తనిఖీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అడవుల్లో అకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగినట్లు సమాచారం.

Advertisement

ఎన్‌కౌంటర్ అనంతరం సంఘటనా స్థలంలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయని, అవన్నీ మావోయిస్టులవేనని అధికారులు తెలిపారు. మృతుల వద్ద నుంచి ఆటోమేటిక్ తుపాకులు, పలు పేలుడు పదార్థాలు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించారు. అటవీ ప్రాంతమంతా భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నాయి. మృతిచెందిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Advertisement

Also Read: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాజ్ భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్పు

ఎన్‌కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. మరోవైపు ఈ ఘటనతో బీజాపూర్ జిల్లాలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×