// // Raju Weds Rambai OTT- అప్పుడే ఓటీటీకి 'రాజు వెడ్స్‌ రాంబాయి'.. -->
E-Paper
Advertisement

Raju Weds Rambai OTT: అప్పుడే ఓటీటీకి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే!

Raju Weds Rambai OTT: అప్పుడే ఓటీటీకి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే!
Advertisement

Raju Weds Rambai OTT: ఇటీవల చిన్న సినిమాగా వచ్చిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి‘ బాక్సాఫీసు వద్ద ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. అందరు కొత్త నటీనటులే. కొత్త డైరెక్టర్‌. దీనికి పోటీగా వచ్చిన పెద్ద సినిమాలు కూడా ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ అందుకోలేకపోయాయి. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లవ్‌స్టోరీతో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ఆయడిన్స్‌ని ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌ ఈ చిత్రానికి బాగా కనెక్ట్‌ అయ్యంది.

ఊహించని కలెక్షన్స్

Advertisement

కొత్త డైరెక్టర్‌ సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్‌ రాజ్, తేజస్వి రావులు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇద్దరు కొత్తవాళ్లే. కానీ, వీరి ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా హీరోయిన్‌ తేజస్వి నటనకు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఆమె సహాజమైన నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమెను నేచురల్‌ బ్యూటీ‌ సాయి పల్లవితో పోల్చుతున్నారు. మొత్తానికి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 14 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం. ఈటీవీ ఇన్‌లో వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని నిర్మించారు.

థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్

థియేటర్లలో హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌ కోసం ఓటీటీ ప్రియులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీ రిలీజ్‌ పై ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. నవంబర్‌ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కాస్తా ఆలస్యం అయ్యేల ఉందట. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ ఈటీవీ విన్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌ కాస్తా ఆలస్యం అయ్యేలా ఉందట. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ సుమారు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని ఇండస్ట్రీలో టాక్‌.

Advertisement

Also Read: Su From So Movie: టీవీలోకి వచ్చేస్తోన్న లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హారర్‌ కామెడీ.. ఈ ఆదివారమే ప్రసారం!

అప్పుడే ఓటీటీకి

ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం రాజు వెడ్స్‌ రాంబాయి కొత్త సంవత్సరంలో ఓటీటీలో అలరించబోతుంది. జనవరి 10న ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ రానుందని సమాచారం. త్వరలోనే ఈమూవీ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ చిత్రం స్టార్‌ బాయ్‌ సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించారు. నిజజీవిత సంఘటన ఆధారం తెరకెక్కిన ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. తెలంగాణలోని ఖమ్మంలో వరంగల్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఒక గ్రామీణ విషాద ప్రేమకథగా రాజు వెడ్స్‌ రాంబాయి మూవీని డైరెక్టర్‌ సాయిలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×