E-Paper
Advertisement

Ayushman Bharat Scheme: కుటుంబం మొత్తానికి ఫ్రీగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్

Ayushman Bharat Scheme: కుటుంబం మొత్తానికి ఫ్రీగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్
Advertisement

Ayushman Bharat Scheme: ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ అవసరం. వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏటా రూ.5,00,000 ఆరోగ్య బీమా అందిస్తుంది. 70 సంవత్సరాలు దాటిన పేద, మధ్య తరగతి వాళ్లు ఆయుష్మాన్ భారత్- PMJAY కింద ఆరోగ్య బీమా కార్డు పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్.. రూ.5,00,000 ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా స్కీమ్. ఇందులో ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్సలు, ఐసీయూ, మందులు కవర్ అవుతాయి. ప్రభుత్వ, ఆయుష్మాన్ భారత్ లో చేరిన ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ పథకం కింద ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఎలాంటి ప్రీమియం కట్టక్కర్లేదు.

అర్హులు, అనర్హులు

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేస్తారు. ఇది ఫ్యామిలీ హెల్త్ కార్డు. ఈ కార్డుతో 70 ఏళ్లు పై బడిన కుటుంబ సభ్యులు ఏడాదికి రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. భూమి లేని పేదలు, గిరిజనులు, భిక్షాటన చేసే నిరుపేదలు, ఎలాంటి ఆశ్రయం లేని కుటుంబాలు, మ్యానువల్ స్కావెంజర్లు, కార్మికులు ఈ స్కీమ్ కు అర్హులు

Advertisement

దారిద్య్ర రేఖకు ఎగువ ఉన్నవారు, ఆదాయపు పన్ను కట్టేవాళ్లు, నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఒకటి కంటే ఎక్కువ గదులతో పక్కా ఇళ్లు కలిగిన కుటుంబాలు, మోటారు వాహనాలు, వ్యవసాయ యంత్రాలు లేదా ఫిషింగ్ బోట్లు కలిగి ఉన్న కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ కు అనర్హులు.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

1. వయస్సు & గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్)
2. చిరునామా రుజువు
3. సంప్రదింపు వివరాలు (మొబైల్, ఇ-మెయిల్)
4. కుల ధృవీకరణ పత్రం
5. ఆదాయ ధృవీకరణ పత్రం
6. కుటుంబం ప్రస్తుత స్థితిని తెలిపే రుజువు

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Advertisement

ఆయుష్మాన్ భారత్ యోజన వెబ్ సైట్ https://beneficiary.nha.gov.in/ లో లబ్ధిదారుడి అర్హతను తనిఖీ చేసుకోవాలి.

Step 1: అధికారిక PMJAY వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Step 2: హోం పేజీలో అర్హత లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: క్యాప్చా కోడ్, మొబైల్ నంబర్, OTPని ఎంటర్ చేయాలి.

Step 4: క్యాప్చా కోడ్‌ను మళ్లీ నమోదు చేసి, ‘లాగిన్’ బటన్‌ను క్లిక్ చేయండి.

Step 5: అవసరమైన సమాచారం నమోదు చేయాలి.

Step 6: ఈ-కేవైసీ’ బటన్‌పై క్లిక్ చేయండి.

Step 7: ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలి.

Step 8: e-KYC పూర్తయిన 15-20 నిమిషాల తర్వాత PMJAY వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి ఆయుష్మాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Also Read: ఆయుష్మాన్ కార్డ్ పొందాలంటే ఏం చెయ్యాలి? ఎలా పొందాలి?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×