E-Paper
Advertisement

OSM Vextra e-Scooter: మార్కెట్ లోకి OSM Vextra ఎలక్ట్రిక్ స్కూటర్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

OSM Vextra e-Scooter: మార్కెట్ లోకి OSM Vextra ఎలక్ట్రిక్ స్కూటర్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

మార్కెట్ లోకి అదిరిపోయే OSM Vextra ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. తన టూ వీలర్ వెహికిల్స్  పోర్ట్‌ ఫోలియో విస్తరణలో భాగంగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.99,900 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఈ మోడల్ తో వ్యక్తిగత మొబిలిటీ రంగంలోకి కంపెనీ ఎంట్రీ ఇస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

OSM Vextra e-Scooter కీలక వివరాలు

OSM Vextra e-Scooterలో 3.45 kWh LMFP బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. పని తీరు విషయానికొస్తే..  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 70 కి.మీ. గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. బ్యాటరీ 3 kW BLDC హబ్ మోటారుతో యాడ్ చేసి ఉంటుంది.

OSM Vextra e-Scooter ఛార్జింగ్ టైమ్

Advertisement

ఇక OSM Vextra e-Scooterలో మూడు రైడింగ్ మోడ్‌ లు ఉన్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఛార్జింగ్ పరంగా ఈ స్కూటర్ ఫాస్ట్ హోమ్ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ నాలుగు గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే, పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటలు పడుతుంది.

OSM Vextra e-Scooter ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇది 3.5-అంగుళాల కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను కలిగి ఉంటుంది. ఇది వేగం, ఛార్జింగ్ పర్సంటేజ్, అంచనా రేంజ్ లాంటి వివరాలను అందిస్తుంది. ఇతర ఫీచర్లను గమనిస్తే, USB ఛార్జింగ్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, క్యారీ హుక్ ఉన్నాయి. GSM కనెక్టివిటీని  ఆప్షనల్ ఫీచర్ గా అందిస్తుంది. భద్రతా విషయంలో, స్కూటర్ CBS బ్రేకింగ్, AIS-156 కంప్లైంట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, IP67 రేటెడ్ మోటార్, బ్యాటరీ భాగాలతో వస్తుంది.

Advertisement

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ vs యమహా EC-06.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే మంచిదంటే?

దేశీయ మార్కెట్‌ తో పాటు, Vextra కంపెనీ విస్తృతణలో భాగంగా ఎంపిక చేసిన ఆఫ్రికన్ మార్కెట్లకు కూడా ఎగుమతులు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయంగా తమ కంపెనీకి మంచి బూస్టింగ్ ఇస్తుందని భావిస్తుంది. దీనితో పాటు త్వరలో మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాప్ బ్రాండ్ మోడల్స్ లాంటి ఫీచర్లతో పాటు తక్కువ ధరలో తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read Also:  తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×