E-Paper
Advertisement

కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ మొదలు.. ఐదున్నర కోట్ల మంది తీర్పు ఎటు?

కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ మొదలు.. ఐదున్నర కోట్ల మంది తీర్పు ఎటు?
Advertisement

Assembly Elections 2026: దేశంలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్లు అధికార-విపక్ష పార్టీల భవితవ్యం తేల్చనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అయితే ఈ మూడు రాష్ట్రాలకు ఒకేవిడతలో పోలింగ్ జరగనుంది.

కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు

Advertisement

ఏప్రిల్ 9న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అందులో కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు ఐదున్నర కోట్ల మంది ఓటర్లు అక్కడి పార్టీల భవిష్యత్తును తేల్చనున్నారు. పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేసింది. ఎండాకాలం కావడంతో ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉదయం ఆరున్నరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

మిగతా రాష్ట్రాల కంటే అందరి చూపు కేరళంపైనే ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీకి అక్కడి ఓటర్లు రెండోసారి అవకాశం ఇవ్వరు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని భావిస్తున్నారు. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉండగా మ్యాజిక్ నంబర్ 71 సీట్లు.

Advertisement

ఆరు గంటలకు పోలింగ్ మొదలు.. ఐదున్నర కోట్ల మంది తీర్పు ఎటు?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం మెజారిటీకి 71 సీట్లు కావాలి. దాదాపు 2.71 కోట్లకు ఓటర్లు ఉన్నారు. అక్కడ అధికార ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎన్నికల అధికారులు కేరళలో అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద వెబ్‌ కాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాటు చేశారు.

ఇక అస్సాం విషయానికి వద్దాం. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ నంబర్ 64 సీట్లు ఉండాల్సింది. ఈ ఎన్నికల్లో దాదాపు రెండున్నర కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడ ఎన్డీయే కూటమి మరోసారి అధికారం లోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి విజయం తమదేనని కాంగ్రెస్ చెబుతోంది. మరి అక్కడి ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.

ALSO READ: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, అవి ఏంటంటే?

ఇక పుదుచ్చేరి శాసనసభ విషయానికి వద్దాం. 30 సీట్లున్న పుదుచ్చేరిలో అధికారం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 16 సీట్లు ఉండాలి. తొమ్మిదిన్నర లక్షల మంది ఓటర్లు అక్కడి పార్టీల భవితవ్యాన్ని నిర్ధేశించనున్నారు. ఎన్డీయే-కాంగ్రెస్-డీఎంకే కూటమి మధ్య పోటీ నెలకొంది. చిన్న రాష్ట్రమైనా అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఈ ఎన్నికల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఓట్ల లెక్కిన మే నాలుగున జరగనుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×