E-Paper
Advertisement

వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే రైస్ రెసిపీస్.. శరీరాన్ని చల్లగా, తేలికగా ఉంచే వంటకాలు

వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే రైస్ రెసిపీస్.. శరీరాన్ని చల్లగా, తేలికగా ఉంచే వంటకాలు
Advertisement

Summer Healthy Rice Recipes| ఎండాకాలంలో వేడి వల్ల వేడి ఆకలి తగ్గి, అలసట ఎక్కువవుతుంది. ఈ సీజన్‌లో చాలా మంది తేలికైన, చల్లని ఆహారాలనే ఇష్టపడతారు. గోధుమ రోటీల కంటే రైస్.. వేసవికి సరైన ఆహారం. రైస్ సులభంగా జీర్ణమవుతుంది, కడుపులో తేలికగా ఉంటుంది. రైస్‌లో కేవలం సాధారణ పదార్థాలు వేసి అనేక రిఫ్రెషింగ్ వంటకాలు తయారు చేయవచ్చు. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచి శక్తిని ఇస్తాయి.

పెరుగు అన్నం: చల్లని క్లాసిక్ రెసిపీ

పెరుగు అన్నం భారతీయ ఇళ్లలో వేసవికి చాలా ప్రసిద్ధి. ఉడికించిన అన్నంలో తాజా పెరుగు కలిపి తయారు చేస్తారు. ఇది శరీరాన్ని చల్లగా చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సాధారణంగా ఆవాలు, కరివేపాకు, మసాలాలు వేస్తారు. కొందరు దోసకాయ గింజలు లేదా దానిమ్మ గింజలు కూడా జోడిస్తారు. వేడి వాతావరణంలో పెరుగన్నం తేలికగా, క్రీమీగా, తృప్తికరంగా ఉంటుంది.

మ్యాంగో రైస్: పులుపు రుచితో రిఫ్రెషింగ్

Advertisement

పచ్చి మామిడి అన్నం తీపి-పులుపు రుచిని ఇస్తుంది. తురుమిన పచ్చి మామిడిని వేడి అన్నంలో కలిపి మ్యాంగో రైస్ తయారు చేస్తారు. ఆవాలు, వేరుశెనగలు, కరివేపాకు జోడిస్తారు. ఈ కాంబినేషన్ రుచిని పెంచి క్రంచ్ ఇస్తుంది. పచ్చి మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. మధ్యాహ్న వేడి వాతావరణం ఉన్నప్పుడు లంచ్‌ కోసం ఇది చాలా బాగుంటుంది.

లెమన్ రైస్: రుచికరమైన లైట్ ఫుడ్

లెమన్ రైస్ చాలా సులభంగా, త్వరగా తయారు చేయవచ్చు. వేడి వేడి అన్నంలోకి తాజా, పులుపు రుచిని ఇస్తుంది. నిమ్మరసం, పసుపు, సాధారణ మసాలాలు మాత్రమే కావాలి. వేరుశెనగలు వేస్తే రుచి క్రంచీగా మరింత మెరుగవుతుంది. ఈ రైస్ వంటకం కడుపుకు భారం లేకుండా తేలికగా ఉంటుంది. లంచ్ బాక్స్‌, ఫాస్ట్ రెసీపీ కోసం సరిపోతుంది.

కొబ్బరి అన్నం: తేలికైన, పోషకమైన వంట

Advertisement

కొకొనట్ రైస్ అంటే కొబ్బరి అన్నం తేలికైగా, కొద్దిగా తీయని రుచినిస్తుంది. తురుమిన కొబ్బరిని ఉడికించిన అన్నంతో కలిపి తయారు చేస్తారు. కరివేపాకు, గింజలు, పచ్చి మిర్చి వేస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు ఉంటాయి. కొబ్బరి అన్నం మెత్తగా, తేలికగా తృప్తికరంగా ఉంటుంది. మసాలా తక్కువ, తేలికైన రుచులు ఇష్టపడేవారికి ఇది సరైన రెసీపీ.

వేసవిలో రైస్ ఎందుకు ఆరోగ్యకరం

రైస్.. పెరుగు, నిమ్మకాయ లాంటి చల్లని పదార్థాలతో కూడా బాగా సెట్ అవుతుంది. కొబ్బరి, పచ్చి మామిడితో కూడా కలిపి తయారు చేయవచ్చు. ఈ కలయికలు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి. వేడి వాతావరణంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రైస్ వంటలు శరీరంలో భారం పెంచకుండానే ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి.

Also Read: పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అసలు తినకూడదు.. ఎందుకంటే

వేసవి రైస్ వంటలు మెరుగుపరచడానికి చిట్కాలు

తాజా, సీజనల్ పదార్థాలు ఉపయోగించండి. అన్నం సరిగ్గా ఉడికించి మెత్తగా చేయండి. వేసవిలో ఎక్కువ నూనెలు, మసాలాలు వాడకండి. తేలికగా తాలింపు వేయండి. వంటలను కొద్దిగా చల్లగా సర్వ్ చేయండి. పెరుగు లేదా సాధారణ సైడ్ డిష్‌తో కలిపి తినవచ్చు.

వేసవిలో తీసుకునే ఆహారం తేలికగా, తాజాగా, చల్లగా ఉండాలి. రైస్ తో చేసే వంటలు రుచి, సౌకర్యానికి సరైన బ్యాలెన్స్ ఇస్తాయి. ఈ సులభమైన రెసిపీలు వేడి వేసవిలో మిమ్మల్ని రిఫ్రెష్‌ చేస్తాయి. ఇవి తయారు చేయడం సులభం పైగా ప్రతి రోజు తినడానికి బాగుంటాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×