E-Paper
Advertisement

ఒకరు కంటే ఎక్కువ భార్యలుంటే.. ఉద్యోగం ఊస్ట్-పథకాలు కట్, ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు!

ఒకరు కంటే ఎక్కువ భార్యలుంటే..  ఉద్యోగం ఊస్ట్-పథకాలు కట్, ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు!
Advertisement

Assam govt: దేశంలోని వివిధ రాష్ట్రాలు కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. కొన్నిరాష్ట్రాలు వాటిని ఫాలో అవుతుంటే, మరికొన్ని వాటికి దూరంగా ఉంటాయి. బహు భార్యత్వంపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఒకరు కంటే ఎక్కువ మంది భార్యలున్నవారికి ప్రభుత్వం నుంచి అందే అన్నిరకాల పథకాలు, ఉద్యోగాలు తొలగించాలని డిసైడ్ అయ్యింది అస్సాం ప్రభుత్వం.

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం-మహిళా సాధికారత-లింగ న్యాయం లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది అస్సాం ప్రభుత్వం. ఈ క్రమంలో కఠినం, కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2026-27 ఆర్థిక బడ్జెట్‌లో బహుభార్యత్వం పాటించే పురుషులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేయాలని ప్రతిపాదన చేసింది.

Advertisement

బహుభార్యత్వంపై చట్టాలు కఠినతరం-ఒకవేళ ఒకరి కంటే ఎక్కువమంది ఉంటే వారిని ప్రభుత్వ ఉద్యోగాల తొలగించేందుకు అసోం సర్వీసెస్ రూల్స్-1964లో సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి జయంత మల్ల బరువా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరాలన్నారు.

ఉద్యోగాలు ఊస్ట్-ప్రభుత్వ పథకాలు కట్-అందుకోసం సమగ్రత, నైతిక విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం పెంపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. బహుభార్యత్వం పాటిస్తున్న ఏ పురుషుడైనా అనర్హుడవుతారని వెల్లడించారు. సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తోంది అసోం ప్రభుత్వం.

Advertisement

ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో బహుభార్యత్వ నిషేధ బిల్లు-2025 ను ఆమోదించింది. కొత్త నిబంధనల ప్రకారం తొలి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోవడం నేరం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్షకు గురవుతారు. కొన్ని షెడ్యూల్డ్ తెగలకు ఆరో షెడ్యూల్ ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ రూల్స్ తెలుసుకోకుంటే బుకింగ్ కష్టమే 

అస్సాం బాటలో సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఆలోచన చేస్తున్నాయట.  ఇలాంటి నిబంధనలు తొలుత సరిహద్దు రాష్ట్రాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.  అసోం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని బెంగాల్ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×