E-Paper
Advertisement

విపక్షాలకు 2029లో బుద్ధి చెబుతారు.. మ‌హిళ‌ బిల్లు వీగిపోవడంపై అమిత్ షా కీల‌క‌ వ్యాఖ్యలు

విపక్షాలకు 2029లో బుద్ధి చెబుతారు.. మ‌హిళ‌ బిల్లు వీగిపోవడంపై అమిత్ షా కీల‌క‌ వ్యాఖ్యలు
Advertisement

Amith Shah: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ చట్టం) వీగిపోవడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. విపక్షాల తీరును తప్పుబడుతూ, ఇది మహిళా శక్తికి జరిగిన అవమానమని ఆయన అభివర్ణించారు.

“ఈరోజు లోక్‌సభలో అత్యంత విచిత్రమైన, బాధాకరమైన దృశ్యం కనిపించింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి అడ్డుకున్నాయి. ఒక చారిత్రక బిల్లును ఓడించడమే కాకుండా, దానిని విజయంగా భావిస్తూ సంబరాలు చేసుకోవడం ఊహకు అందని విషయం. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు” అని అమిత్ షా పేర్కొన్నారు.

Advertisement

ప్రతిపక్షాల తీరు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ బిల్లు వీగిపోవడం వల్ల ఇప్పుడు మహిళలు లోక్‌సభ మరియు శాసనసభలలో తమకు దక్కాల్సిన 33 శాతం రిజర్వేషన్‌ను పొందలేరు. మహిళల రాజకీయ సాధికారతకు కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు పదేపదే అడ్డుపడుతున్నాయి. వీరి ఆలోచనా విధానం మహిళల ప్రయోజనాలకు గానీ, దేశ ప్రయోజనాలకు గానీ ఏమాత్రం అనుకూలంగా లేదు.” అని ధ్వజమెత్తారు.

విపక్షాలు చేసిన ఈ పనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమిత్ షా హెచ్చరించారు. “మహిళలకు జరిగిన ఈ అవమానం ఇక్కడితో ఆగదు. ప్రతిపక్షాలు 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే కాకుండా, ప్రతి స్థాయిలో జరిగే ఎన్నికల్లో ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కోవలసి వస్తుంది. దేశ మహిళా లోకం ఈ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు.” అని ఆయన స్పష్టం చేశారు.

మహిళా ద్రోహుల కూటమి:  బండి సంజయ్ ఫైర్

Advertisement

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ మరియు ‘ఇండియా’ కూటమి లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఇది మహిళా లోకానికి జరిగిన తీరని ద్రోహమని, దీనికి బాధ్యులైన పార్టీలను ప్రజలు ముఖ్యంగా మహిళలు క్షమించరని ఆయన హెచ్చరించారు.

“మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కాల ‘కూట’మి తన విషాన్ని కక్కింది. దేశంలోని కోట్లాది మంది మహిళల ఆశలను వమ్ము చేసి, మళ్ళీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మొదటి నుండి మహిళా వ్యతిరేకి అని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపితమైంది” అని బండి సంజయ్ మండిపడ్డారు.

బిల్లును అడ్డుకున్న పార్టీలన్నీ కేవలం తమ కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. డూప్లికేట్ గాంధీలు, స్టాలిన్లు, అఖిలేష్ యాదవ్ కుటుంబాలకు చెందిన మహిళలకు మాత్రమే పదవులు ఉండాలా? సామాన్య మహిళలకు చట్టసభల్లో వాటా ఇస్తుంటే వీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారు?” అని నిలదీశారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహులేనని, అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఇస్తామని వంచించి, ఇప్పుడు బిల్లును ఓడించారని ధ్వజమెత్తారు. “దేశ ప్రజలు పదేపదే ఓడిస్తున్నా కాంగ్రెస్ నేతలకు జ్ఞానోదయం కలగడం లేదు. త్వరలోనే మహిళలంతా ఏకమై ఈ కూటమిని ఓడించి సంబురాలు చేసుకునే రోజులు వస్తాయి” అని పేర్కొన్నారు.

Read Also: లోక్‌సభలో వీగిపోయిన మహిళా బిల్లు.. ప్రజాస్వామ్య విజయం అన్న సీఎం రేవంత్ రెడ్డి!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×