E-Paper
Advertisement

Air India Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. 4 గంటలు ప్రయాణం తర్వాత వెనక్కి మళ్లింపు

Air India Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. 4 గంటలు ప్రయాణం తర్వాత వెనక్కి మళ్లింపు
Advertisement

Air India Bomb Threat| ఇటీవల విమానాల్లో బాంబులున్నట్లు బెదిరింపులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ బెదిరింపులు ఫోన్ కాల్స్ లేదా ఈ మెయిల్స్ రూపంలో వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు వచ్చింది. విమానం గాల్లో ఉండగానే ఈ బెదిరిపులు రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నాలుగు గంటలపాటు ప్రయాణం చేసిన తరువాత ఈ బెదిరింపు రావడంతో పైలట్లు తిరిగి బయలు దేరిన స్థానానికి మళ్లించారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఈ విమానాన్ని పైలట్లు టేకాఫ్ అయినచోటే దింపారు (Mumbai-New York). జాతీయ మీడియా కథనాల ప్రకారం..

బోయింగ్ 777 విమానం ముంబై నుంచి న్యూయార్క్ వెళుతోంది. నాలుగు గంటల తర్వాత అజర్‌బైజాన్ ప్రాంతంలో ఆకాశంలో ఉండగా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు (Bomb threat) వచ్చాయి. సిబ్బందికి ఈ బెదిరింపులు రావడంతో.. వెంటనే అప్రమత్తమైన పైలట్లు తిరిగి ముంబై వైపు విమానాన్ని మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే విమానంలో బాంబు ఎక్కడుందో కనిపెట్టడానికి బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి.. తనిఖీలు చేపట్టింది. అయితే బాంబు లాంటిదేమీ లేదని ఎవరో నకిలీ కాల్ చేశారని అని తెలుస్తోంది.

Advertisement

Also Read: మహిళలు ఒక హత్య చేసినా శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్య

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన  ప్రమాదం

గోవా నుంచి వస్తున్న విమాన సర్వీస్కు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్ లైన్స్  6E-6973 విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా విశాఖపట్నంకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశాడు.

Advertisement

రన్వేపై టేకాఫ్ అవుతున్న మరో విమానం

విమాన సర్వీస్ను డౌన్ చేసిన పైలట్ అప్పటికే రన్వేపై టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం విమానాన్ని ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్ విశాఖపట్నంనకు వెళ్లిపోయింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×