E-Paper
Advertisement

Ahmedabad Flight Crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. ఫ్లైట్‌లో 242 మంది ప్రయాణికులు

Ahmedabad Flight Crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. ఫ్లైట్‌లో 242 మంది ప్రయాణికులు
Advertisement

Ahmedabad Flight Crash: అహ్మదాబాద్ లోని షాలిబాగ్ ప్రాంతంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానాశ్రం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ప్లైట్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నారని సమాచారం. విమానం జనావాసాల సమీపంలో కూలిపోయినట్లు జాతీయ మీడియా తెలిపింది.

ఈ ఘటన అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని షాహిబాగ్ ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతుండటంతో వెంటనే 12 ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలు ఆర్పే పనిలో పడ్డాయి. విమానంలో ఉన్న ప్రయాణికుల్లో కొంత మంది స్పాట్‌లోనే చనిపోయినట్లు తెలుస్తోంది.  విమానంలో నుంచి కొంతమందిని వెలికి తీసి గాయపడిన వారికి వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో స్థానికులు కూడా గాయపడినట్లు సమాచారం.

Advertisement

ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం AI-171 గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరింది. కానీ రన్ వే పై నుంచి టేకాఫ్ అయిన తరువాత ఆకాశంలో కొద్ది దూరం వెళ్లాక విమానం కూలిపోయినట్లు అధికారులు చెప్పారు. దీంతో విమానం కూలిన పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో ఉంది.

ఈ సమాచారం తెలియగానే పౌరవిమానాయన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు పరిస్థితిని సమీక్షించేందుకు ఘటన స్థలికి బయల్దేరారు. విమానం జనావాసాలపై కూలిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. ప్రమాద సమయానికి విమానంలో 12 మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×