E-Paper
Advertisement

Raipur Central Jail: ప్రియుడి పుట్టినరోజు.. జెలుకి వెళ్లిన ప్రేయసి, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Raipur Central Jail: ప్రియుడి పుట్టినరోజు.. జెలుకి వెళ్లిన ప్రేయసి, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Advertisement

Raipur Central Jail: కీలకమైన కేసుల్లో నిందితులను జైలుకి తరలిస్తారు. అక్కడికి వెళ్తే వారిలో కొంతైనా మార్పు వస్తుందని భావిస్తుంటారు. అలాంటి జైలులో ఇంట్లో మాదిరిగా జరిగితే ఇంకేముంది? సరిగ్గా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఏకంగా ప్రియుడి పుట్టినరోజు నాడు జైలుకి వెళ్లింది అతడి ప్రేయసి. బర్త్ డే వేడుకలను వీడియో తీసి పోస్టు చేసింది. ఇంతకీ ఎక్కడో తెలుసా?

వార్తల్లోకి రాయ్‌పూర్ సెంట్రల్ జైలు

Advertisement

ఈ మధ్యకాలంలో దేశంలోని కొన్ని జైలు తరచు వార్తల్లోకి వస్తున్నాయి. వాటిలో ముందుగా వినిపించేది బెంగుళూరులోని సెంట్రల్ జైలు. ఆ జాబితాలోకి ఇప్పుడు మరొక జైలు చేరింది. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఓ యువతి తన ప్రియుడిని కలిసేందుకు నేరుగా జైలుకు వచ్చింది. విజిటింగ్ అవర్స్ సమయంలో రూమ్‌కి వెళ్లి ప్రియుడి వీడియో తీసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

నార్మల్‌గా జైలులో ఉన్న నిందితులను కలిసి కాసేపు మాట్లాడేందుకు బంధువులకు అవకాశం ఇస్తారు సంబంధిత అధికారులు. జైలులో తన ప్రియుడి పుట్టినరోజు జైలుకి వెళ్లింది. ఆ యువతి కెమెరా వైపు భావోద్వేగంతో చూస్తింది. ఇవాళ రోజు నా ప్రేమ పుట్టినరోజు.. ప్రియుడ్ని కలవడానికి సెంట్రల్ జైలుకు వచ్చాను. అతడు తనతో లేకపోవడం చాలా బాధాకరమని చెప్పుకొచ్చింది.

Advertisement

ప్రియుడి కోసం జైలుకి ప్రేయసి, పుట్టినరోజు వీడియో తీసి 

పుట్టినరోజున తాను ప్రియుడిత లేనుకానీ, కలవడానికి వచ్చానని ప్రస్తావించింది. అతడి స్పందన ఎలా ఉందో చూద్దామని చెప్పింది. జైలులోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ఐనప్పటికీ కొందరు ఫోన్లను తీసుకెళ్లి నిందితులతో మాట్లాడిస్తున్నారు. మరికొందరు ఏకంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు.

ఈ విధంగా జరగడంపై అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోలో కనిపించిన ఖైదీ పేరు తారకేశ్వర్‌. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద అరెస్టయ్యాడు. యువతి ఈ వీడియోకి ఖుదా గవా సినిమాలోని ఓ సాంగ్ జోడించి ఆమె సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.

ALSO READ: చిరుతతో అరగంటపాటు ఫైటింగ్.. తండ్రీ కొడుకు సేఫ్, పెద్దాయన ధైర్యానికి హ్యాట్సాఫ్

రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో పలువురు ఖైదీల వీడియోలు బయటకు వచ్చాయి. కొద్దిరోజుల కిందట మహ్మద్ రషీద్ అలీ అనే ఓ ఖైదీ జైల్లో జిమ్ చేస్తూ తోటివారితో దిగిన సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అక్టోబర్ 13- 15 మధ్య జైలు లోపల వ్యాయామం చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అతడ్నిపై 10 రకాలు కేసులున్నాయి. అంతకుముందు జార్ఖండ్ గ్యాంగ్‌స్టర్ అమన్ సా.. జైల్లో ఫోటోషూట్ నిర్వహించడం, ఆ తర్వాత అవి వైరల్ అయ్యాయి. అయితే తాజా ఘటనపై జైలు అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×