E-Paper
Advertisement

‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ : Om Shanti Shanti Shantihi

‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ : Om Shanti Shanti Shantihi
Advertisement

Om Shanti Shanti Shanthihi Movie Review

 

మూవీ  రివ్యూ : ఓం శాంతి శాంతి శాంతి:

 

నటీనటులు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు
దర్శకత్వం వి. జయశంకర్
సంగీతం వివేక్ సాగర్

కథ ఏందంటే :

Advertisement

మన ప్రశాంతి( ఈషా రెబ్బా) కథ ఇది. చిన్నప్పటి సంది ఇంట్ల వాళ్లు ఏది చెబితే అదే పని. ఆటలు, చదువులు అన్నీ గాలికొదిలేసి వాళ్లు చెప్పినట్టే వింటది. కనీసం పెళ్లయినంకనన్న తన మొగుడు తనను అర్థం చేసుకుంటాడని ఆశపడ్తది. కానీ, ఆమెకు తగిలిన మొగుడు ఓంకార్ నాయుడు( తరుణ్ భాస్కర్) పక్కా మెయిల్ షావనిస్ట్ గాడు. ముక్కు మీదే కోపం. పెళ్లాం అంటే కాలి కింద చెప్పు లెక్క చూస్తడు. చిన్న విషయానికే చేయి చేసుకోవడం అతగానికి అలవాటు. ఇక ఇట్లా కాదని మన ప్రశాంతి ఫిక్స్ అయి. తన మొగుడికి అతని స్టైల్ లోనే ఎట్లా బుద్ధి చెప్పింది? ఆ గొడవలో వాళ్ల సంసారం ఏమైంది? అనేది ఈ సినిమా ముచ్చట.

Read also-Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!

విశ్లేషణ 

Advertisement

మలయాళంలో వచ్చిన’ జయ జయ జయ జయహే’కి ఇది రీమేక్. కథ పాతదే అయినా. మన గోదావరి యాస, వెటకారం కలిపి గట్టిగానే ట్రై చేశారు. ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది. అక్కడి నుంచే అసలు ఆట మొదలైతది. సినిమా అక్కడక్కడ కొంచెం స్లో అనిపించినా. కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది.ఎవరెలా చేశారంటే తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా మనకు తెలుసు కానీ, ఈ సినిమాలో నటనతో ఇరగదీశాడు. బాసిల్ జోసెఫ్ లాంటి యాక్టర్ చేసిన రోల్ ని తను కూడా తన మార్క్ కామెడీతో రక్తి కట్టించాడు. ఈషా రెబ్బా ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్నాళ్లకు ఒక మంచి రోల్ పడింది. యాక్షన్ సీన్లలో ఈషా వేసిన కిక్కులు చూస్తే థియేటర్ లో ఈలలు పడాల్సిందే. బ్రహ్మాజీ కామెడీతో బాగా నవ్వించాడు. ఇక క్లైమాక్స్ లో బ్రహ్మానందం గారు వచ్చి సినిమాకు మంచి ఫినిషింగ్ ఇచ్చారు. మ్యూజిక్ వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగా సెట్ అయింది.

ప్లస్ పాయింట్స్ : 

తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్.
ఈషా రెబ్బా యాక్షన్ సీక్వెన్స్ లు.
నేటివిటీకి తగ్గట్టు రాసిన డైలాగులు.
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

మలయాళంలో ముందే చూసేసిన వాళ్లకు కథ తెలిసిపోయి కొంచెం బోర్ కొడుతది.
కొత్తగా ఏమీ లేదనే ఫీలింగ్ కలగడం.
సినిమా అందరికీ నచ్చుతుందా అంటే కొంచెం డౌటే( లిమిటెడ్ అప్పీల్).

అసలు ముచ్చటకు వస్తే :

 

 కథ పాతదే అయినా. ఈషా( రెబ్బా) దెబ్బకి శాంతి దొరుకుతుంది!

 

Om Shanti Shanti Shantihi Movie Review – 2.25 / 5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×