E-Paper
Advertisement

​​Jharkhand Encounter: జార్ఖండ్‌‌లో భారీ ఎన్‌ కౌంటర్.. మృతుల్లో కీలక నేతలు, ముమ్మరంగా గాలింపు

​​Jharkhand Encounter: జార్ఖండ్‌‌లో భారీ ఎన్‌ కౌంటర్.. మృతుల్లో కీలక నేతలు, ముమ్మరంగా గాలింపు
Advertisement

​​Jharkhand Encounter: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల రహిత దేశంగా చేయాలని భావిస్తోంది కేంద్రం. అందుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తోంది.  తాజాగా గురువారం ఉదయం జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది మావోలు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

జార్ఖండ్‌‌లో భారీ ఎన్‌‌కౌంటర్

Advertisement

గురువారం ఉదయం జార్ఖండ్‌లోని భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్భూం జిల్లాలోని సారండా అడవుల ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి.

మావోయిస్టు పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు అక్కడి పరిసరాలను బట్టి అనుమానిస్తున్నాయి బలగాలు.  భారీ సంఖ్యలో సమావేశమైనట్టు పోలీసులకు సమాచారం రావడంతో రాష్ట్ర-కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత పూర్తి సమాచారాన్ని అందిస్తామని జార్ఖండ్ పోలీసు ప్రధాన కార్యాలయం పేర్కొంది.

Advertisement

అనేక మంది మావోయిస్టులు మృతి.. వారిలో కీలక నేతలు

జార్ఖండ్‌ను నక్సలైట్ రహిత రాష్ట్రంగా మార్చడానికి సారందా అటవీ ప్రాంతం అతిపెద్ద అడ్డంగా మారిందని చెబుతున్నారు. ఈ ప్రాంతం మావోయిస్టు కీలక నేత మిసిర్ బెస్రా చేతిలో ఉందని పోలీసు నివేదికలు సూచిస్తున్నాయి. అతడి తలపై కోటి రూపాయల బహుమతి ఉంది. మరి ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కీలక నేతలు ఎవరు అనేది ఇంకా తెలియాల్సివుంది.

మావోల నుంచి కాల్పులు ఆగడంతో గాలింపు ముమ్మరం చేశారు.  లభ్యమైన మావోల మృతదేహాలను ఒకచోటుకు చేర్చుతున్నారు.  ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.  దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 65 రోజుల వైవాహిక బంధానికి 13 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×