E-Paper
Advertisement

Helicopter Services: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి హెలికాప్టర్ సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!

Helicopter Services: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి హెలికాప్టర్ సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Helicopter Services: మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రభుత్వం, పర్యాటన శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పర్యాటన రంగం అభివృద్ధి, భక్తులకు జాతరను సరికొత్త కోణంలో చూసే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ సేవలు నేటి నుండి ప్రారంభమయ్యాయి.

జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని.. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు ఆకాశం నుండి జాతరను వీక్షించేందుకు అధికారులు పడిగాపూర్ వద్ద ప్రత్యేక హెలిప్యాడెన్ ఏర్పాటు చేశారు.  ఈ సేవలు ఈ నెల 31 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

Advertisement

పడిగాపూర్ లేదా ఎలుబాక ప్రాంతం నుండి మేడారం జాతరను ఆకాశం నుండి 6నుంచి7 నిమిషాల పాటు వీక్షించవచ్చు. దీనికి ఒక్కోక్కరికి రూ.4800 ఛార్జ్ చేస్తున్నారు.  హనుమకొండ నుంచి నేరుగా మేడారం చేరుకుని, తిరిగి వచ్చే ప్రయాణానికి ఒక్కొక్కిరికి రూ. 35,999 ఛార్జ్ నిర్ణయించారు.

లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయే మేడారం పరిసరాలను, గద్దెల ప్రాంతాన్ని , దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆకాశం నుండి చూడటం భక్తులకు ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. అత్యవసర పరిస్థితిల్లో మెడికల్ సర్వీసుల కోసం కూడా  ఈ హెలికాప్టర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.

Advertisement

సాధారణ భక్తులకు ఈ ధరలు కొంత భారంగా అనిపించినప్పటికీ.. సమయం ఆదా చేసుకోవాలనుకునే వారికి, జాతర అందాలను విహంగ వీక్షణం చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

ALSO READ: బైక్‌ను ఢీకొన్న కారు.. స్పాట్లోనే ఇద్దరు స్నేహితుల మృతి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×