E-Paper
Advertisement

Parliament : కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం.. లోక్ సభలో మరో 49 మందిపై వేటు..

Parliament : కొనసాగుతున్న సస్పెన్షన్ల  పర్వం.. లోక్ సభలో మరో 49 మందిపై వేటు..
Advertisement

Parliament : స్మోక్ బాంబ్ అంశం పార్లమెంట్‌ను కుదుపేస్తోంది. భద్రతా లోపంపై చర్చించాలని ప్రతిపక్షాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. లోక్‌సభలో మరో 49 మంది విపక్ష సభ్యులపై వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. సోమవారం వరకు మొత్తం 92 మంది సస్పెండ్ అయ్యారు.

మరోవైపు శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో భద్రతా లోపంపై చర్చించాలని ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో.. ఉభయ సభల నుంచి నిన్న 92 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది ఇండియా కూటమి.

Advertisement

మరోవైపు స్మోక్‌ బాంబ్‌ ఎటాక్‌పై హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మాట్లాడాలని, వివరణ ఇవ్వాలని పట్టు పడుతూ పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు విపక్ష నేతలు. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా సస్పెన్షన్‌కు గురైన ఎంపీలంతా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ సర్కార్‌పై ఫైర్‌ అయ్యారు ఖర్గే. భద్రతా లోపాలపై చర్చించేందుకు హోం మంత్రి ఎందుకు సిద్ధంగా లేరని నిలదీశారు.

.

Advertisement

.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×