E-Paper
Advertisement

Aadhaar Deactivates: మోసాలు జరగకుండా కేంద్రం నిర్ణయం.. 2.5 ఆధార్‌ నెంబర్లు డియాక్టివేట్‌, కేంద్రమంత్రి వెల్లడి

Aadhaar Deactivates: మోసాలు జరగకుండా కేంద్రం నిర్ణయం.. 2.5 ఆధార్‌ నెంబర్లు డియాక్టివేట్‌, కేంద్రమంత్రి వెల్లడి
Advertisement

Aadhaar Deactivates: ఆధార్ కార్డు పేరు చెబితే చాలు సామాన్యులు కంగారు పడుతుంటారు. దీనికి గురించి ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుంటాయోనని బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఆధార్ కార్డుల విషయంలో కేంద్రం ఓ కబురు చెప్పింది. మోసాలు జరగకుండా ఉండేందుకు రెండున్నర కోట్లు ఆధార్ కార్డు నెంబర్లను తొలగించినట్టు వెల్లడించింది. బుధవారం లోక్‌సభలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద ఓ ప్రశ్నకు ఈ వివరాలు లిఖిత పూర్వంగా వెల్లడించారు.

దేశంలో 2.5 ఆధార్‌ నెంబర్లు డియాక్టివేట్‌

Advertisement

పుట్టిన నుంచి పాఠశాలు, బ్యాంక్ అకౌంట్ ఇలా ఏది చేయ్యాలన్నా కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. దీని గురించి తెలియన మొదట్లో ఒకొక్కరు రెండు లేదా మూడు ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నింటిని వాడడం మానేశారు. ఆ విధంగా తీసుకున్నవారు మనీ లావాదేవీలకు ఉపయోగించేవారు. ఆ విధంగా చాలా వరకు మోసాలు జరుగుతున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో అటువైపు ఫోకస్ చేసింది. ఆధార్ డేటాబేస్‌ను సురక్షింతంగా ఉంచాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్ల ప్రజల ఆధార్‌ నెంబర్లను డీయాక్టివేట్‌ చేసినట్లు తెలిపింది. బుధవారం లోక్‌సభలో పలువురు సభ్యుల ప్రశ్నలకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద లిఖిత పూర్వంగా వీటిపై సమాధానం ఇచ్చారు.

Advertisement

లోక్‌సభలో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద  వెల్లడి

ప్రపంచంలో అతిపెద్ద బయో మెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థగా ఒకటిగా నిలిచింది ఆధార్‌. ఇప్పుడు సుమారు 134 కోట్ల మందికి సంబంధించిన వినియోగదారులు ఉన్నారు. వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్‌ నెంబర్ క్రియాశీలకంగా ఉండడంతో సంక్షేమ పథకాల దుర్వినియోగం, మోసాలు జరిగే ఆస్కారం ఉన్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ ఓ కార్యక్రమం చేపట్టింది.

ఆధార్‌ వినియోగదారుడి చిరునామాలో నమోదైన రాష్ట్రం ఒకటిగా ఉండేది. మరణం నమోదైన మరొక రాష్ట్రం ఉండేది. అలాంటి వ్యక్తుల వివరాలు సమీకరించి ధృవీకరించిన తర్వాత వాటిని తొలగించింది. అంతేకాదు ఆయా వ్యక్తుల ఆధార్‌ నెంబర్లను నిలిపివేసింది. మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు వినియోగదారులు తమ బయో మెట్రిక్‌ను లాక్‌/అన్‌లాక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు సదరు మంత్రి అందులో పేర్కొన్నారు.

ALSO READ: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగని ట్రాఫిక్ నరకం.. 40 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు!

పౌరుల ప్రధాన బయోమెట్రిక్ సమాచారాన్ని UIDAI ఏ థర్డ్ పార్టీతో పంచుకోదని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం సురక్షితమైన QR కోడ్‌లు, పేపర్‌లెస్ e-KYCని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల డేటాను సురక్షితంగా ఉంచడానికి వీలవుతుందన్నారు. లావాదేవీల సమయంలో వినియోగదారులు ఉన్నట్లు నిర్ధారించే లైవ్‌నెస్‌ డిటెక్షన్‌ ఫీచర్‌తో కూడిన ఫేస్‌ అథెంటికేషన్, ఆధార్‌ సెక్యూర్‌ క్యూఆర్‌ కోడ్, ఆఫ్‌లైన్‌ ఈ–కేవైసీ వంటివి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×