E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..
Advertisement

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ హిట్ తర్వాత మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ కూడా ఖారారు చేశేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సింగిల్ ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసిందే. రిలీజ్ డేట్ కూడా దగ్గరపడటంతో ప్రమోషన్లు మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో సెకండ్ సింగిల్ విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమైంది. ఈ చిత్రం నుంచి రెండో పాటను ఫిబ్రవరి 15న శివరాత్రికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రచార చిత్రాలు పవర్ స్టార్ ఫ్యాన్ లో మంచి జోష్ నింపాయి. గబ్బర్ సింగ్ కాంబో దేవీశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read also-Illu  Illalu Pillalu Today Episode: వేదవతి కన్నీళ్లు.. తండ్రి కోసం వచ్చిన అమూల్య.. విశ్వం ఇంట్లో దొంగతనానికి భాగ్యం ప్లాన్..

Advertisement

ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. మరో హీరోయిన్ పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. హీరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, దశరధ్ స్క్రీన్‌ప్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నరు కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజిక్ బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. ఇది కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read also-Netflix OTT : ‘ఇక్కా’ నుండి ‘ఫ్యామిలీ బిజినెస్’ వరకు…. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ను షేక్ చేయనున్న సినిమాలు, సిరీస్లు ఇవే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×