E-Paper
Advertisement

Maharashtra : మండుతున్న ఎండలు.. అవార్డుల ఫంక్షన్ లో విషాదం.. వడదెబ్బకు 13 మంది బలి..

Maharashtra : మండుతున్న ఎండలు.. అవార్డుల ఫంక్షన్ లో విషాదం.. వడదెబ్బకు 13 మంది బలి..
Advertisement

Maharashtra : దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మహారాష్ట్రలో ఒకే చోట 13 మంది మృత్యువాతపడ్డారు. నవీ ముంబైలో మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం జరిగింది. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు తరలివచ్చారు.

ఉదయం 8 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈవెంట్‌ను చూసేందుకు జన కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణ కల్పించేలా టెంట్లు మాత్రం వేయలేదు. మండుటెండలో గంటల కొద్దీ కూర్చువడంతో చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే .. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×