E-Paper
Advertisement

Pan-Aadhaar Link Status : పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవాలా… ఇదికో లింక్… అప్‌డేటెడ్ వర్షన్

Pan-Aadhaar Link Status : పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవాలా… ఇదికో లింక్… అప్‌డేటెడ్ వర్షన్
Advertisement
Pan-Aadhaar Link Status

Pan-Aadhaar Link Status : పాన్-ఆధార్ కార్డ్ లింక్ తప్పనిసరి. లేదంటే.. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఎటువంటి ట్రాన్సాక్షన్స్‌కు అవకాశం ఉండదు. అందుకే, పాన్-ఆధార్ లింక్ మస్ట్. ఇప్పటికే ఎన్నోసార్లు డెడ్‌లైన్స్ పెంచుకుంటూ వచ్చిన కేంద్రం.. వెయ్యి రూపాయల ఫైన్‌తోనూ చివకి అవకాశం ఇస్తోంది. జూన్ 2023 చివరి నాటికల్లా పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం.. పాన్ కార్డు ఉన్న వాళ్లు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలి. ఇప్పటికే చాలా మంది పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారు. అయితే, స్టేటస్ తెలుసుకోవడం కోసం ఓ కొత్త లింక్‌ను ఇచ్చింది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.  ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవచ్చు. పైగా లింక్ కోసం పేమెంట్ ఎలా చేయాలో కూడా ఈ లింక్‌లో అప్‌డేట్ ఉంది.

Advertisement

లింక్: https://www.incometax.gov.in/iec/foportal/

ముందుగా ఈ లింక్ ఓపెన్ చేయగానే.. పక్కన క్విక్ లింక్స్‌లో.. లింక్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. దానికంటే ముందే లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ ఉంది. ఆల్రడీ పాన్-ఆధార్ లింక్ చేసుకుని ఉంటే.. స్టేటస్ కోసం ఇందులో చూసుకోవచ్చు. ఇందుకోసం మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి ఓటీపీ అడగదు.

Advertisement

ఇక దాని కింద లింక్ ఆధార్ లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి.. పాన్ నెంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత పేమెంట్ కోసం ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తరువాత ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత… ఇన్‌కమ్ ట్యాక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.

పేమెంట్ చేసిన తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×