E-Paper
Advertisement

Kavitha: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ ఫిరాయించలేదా? ప్రభుత్వంపై కవిత ఫైర్

Kavitha: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ ఫిరాయించలేదా? ప్రభుత్వంపై కవిత ఫైర్
Advertisement

Kavitha: బీఆర్ఎస్ బీ ఫామ్ పై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసిన ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయించలేదట అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై  ఫైర్ అయ్యారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలాంటి నిర్ణయం ఇదన్నారు. ఎన్నికల్లో వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వారిపై కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడదు అంటే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా? అని నిలదీశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బుధవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రకటించిన నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి అధ్యాయాలలో ఒకటి అని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల సభ్యులు గీత దాటితే వేటు వేయాల్సిన వ్యవస్థ ఒక పార్టీ నిర్ణయాన్ని తమ తీర్పు ద్వారా ప్రకటించినట్టు అయ్యిందన్నారు. చట్టసభల అధిపతులు పక్షపాతంతో నిర్ణయాలు ప్రకటిస్తే న్యాయ స్థానాలు వాటిని సరి చేయాలి.. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు గౌరవం పెరుగుతుందన్నారు.

Also Read: Iran Attack: భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌పై ఇరాన్ అటాక్.. స్పాట్‌లో 20 మంది సిబ్బంది..?

కుమారుడితో కలిసి దీక్ష

Advertisement

వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష బుధవారానికి మూడో రోజుకు చేరింది. కవిత వెంట ఆమె తనయుడు ఆదిత్య దీక్షలో కూర్చొన్నారు. నేతలను పరిచయం చేశారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత నుంచి తల్లి కవిత వెన్నంటి ఆదిత్య ఉంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టిన నిరాహార దీక్ష, బీసీ బిల్లుల ఆమోదం కోసం చేపట్టిన బంద్ లోనూ ఖైరతాబాద్ లో చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఇప్పుడు దీక్షలో పాల్గొని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఆదిత్య మారారు. జాగృతి జనంబాట కార్యక్రమంలోనూయాక్టివ్ లోనూ ఆదిత్య యాక్టీవ్ గా పాల్గొన్నారు.

Also Read: Kadiyam Srihari: కేసీఆర్ సారీ చెప్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×