E-Paper
Advertisement

Andhra King Taluka: నాపైన ఆ అభిమాని పుస్తకం రాశాడు, పదేళ్లు నాతో మాట్లాడలేదు

Andhra King Taluka: నాపైన ఆ అభిమాని పుస్తకం రాశాడు, పదేళ్లు నాతో మాట్లాడలేదు
Advertisement

Andhra King Taluka: మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా నవంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాలుగు పాటలకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

అలానే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ చూస్తుంటే హీరోకి మరియు తన అభిమానికి మధ్య జరిగే ఒక జర్నీ ను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహేష్. ఈ సినిమాతో రామ్ పోతినేని సక్సెస్ అందుకుంటాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర ఒక కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర కూడా పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు.

నాపైన అభిమాని పుస్తకం రాశాడు 

Advertisement

ఈ సినిమాలో ఉపేంద్ర అభిమానిగా రామ్ పోతినేని కనిపిస్తాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ రీసెంట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉపేంద్ర కాకుండా వేరే హీరో కూడా ఈ సినిమాలో ఉంటారు అని తెలుస్తుంది.

అభిమానికి మరియు హీరోకి మధ్య జరిగే కథ కాబట్టి మీ జీవితంలో ఎదురైనా పిచ్చి అభిమాని ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఉపేంద్రకు ఎదురయింది దీనికి ఆసక్తికర సమాధానం చెప్పారు దర్శకులు నటులు ఉపేంద్ర.

Advertisement

నా జీవితంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. మురళి అని ఒక అభిమాని ఉన్నాడు నా సినిమాలను చాలా పిచ్చిపిచ్చిగా చూశాడు. తన పెళ్లికి రమ్మని నన్ను పిలిచాడు. ఒక పాతిక సంవత్సరాల క్రితం నేను ఆ పెళ్లికి హాజరయ్యాను. నేను అది మాత్రమే ఆయన కోసం చేశాను కానీ ఇప్పటికీ కూడా నన్ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తూ ఉంటాడు.

నా పుట్టినరోజు వస్తే బ్యానర్లు కడతారు వంద కిలోల ఫ్లవర్స్ తీసుకొచ్చి మీద వేస్తారు. ఏమైనా అంటే మీరు ఏమి మాట్లాడకండి మీరు సైలెంట్ గా కూర్చుండి ఇది మాకు పండగ అంటూ ఉంటారు. ఒక అబ్బాయి నా గురించి చూసి పుస్తకం కూడా రాశాడు.

పదేళ్లపాటు మాట్లాడలేదు

నా ఏ సినిమా చూసి ఒక అబ్బాయి కంప్లీట్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడట. పదేళ్లపాటు ఎవరితో కూడా మాట్లాడలేదు అని చెప్పాడు. ఇలాంటి అభిమానులు చాలామంది ఉన్నారు అని ఉపేంద్ర ఈ ఇంటర్వ్యూలో షేర్ చేశారు.

Also Read: Mana Shankara Varaprasad Gaaru : భీమ్స్ చేసిన పనికి మెగాస్టార్ మూవీ షూటింగు క్యాన్సిల్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×