E-Paper
Advertisement

Baby Suffered Heart Attack: 13 నెలల పసిపాప నాలుకను తీసేసిన డాక్టర్లు.. అది తాగిన వెంటనే హార్ట్ ఎటాక్, చివరికి..

Baby Suffered Heart Attack: 13 నెలల పసిపాప నాలుకను తీసేసిన డాక్టర్లు.. అది తాగిన వెంటనే హార్ట్ ఎటాక్, చివరికి..
Advertisement

Baby Suffered Heart Attack: యూకేలోని బర్మింగ్‌హామ్‌లో 13 నెలల చిన్నారి జీవితాన్నే మార్చే విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిన్నారి.. ఇంట్లో నేలపై ఉంచిన తెల్లటి డ్రెయిన్ క్లీనర్ బాటిల్‌ను పొరపాటున పాలు అనుకుని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. డాక్టర్లు అతడి నాలుకను తీసి వేయాల్సి వచ్చింది. 

Advertisement

చిన్నారి తండ్రి నదీన్ అల్షామెరి ఓ నేషనల్ పత్రికకు పూర్తి విషయాన్ని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. తల్లి బాత్రూమ్‌ను శుభ్రం చేస్తుండగా.. పసివాడు బాత్రూంలోకి వెళ్లి అక్కడున్న తెల్లటి డ్రెయిన్ క్లీనర్ బాటిల్‌ను తీసుకున్నాడు. “ఆ బాటిల్‌ను చూసి అతను పాలు అనుకున్నాడు” అని నదీన్ తెలిపారు. అంతే కాకుండా “ఏం జరిగిందో మాకు తెలిసే సమయానికి.. అదంతా శరీరానికి వ్యాపించింది” అంటూ ఆ భయంకరమైన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు.

గుండెపోటుతో పోరాటం:

Advertisement

డ్రెయిన్ క్లీనర్ తాగడం వల్ల పిల్లాడి పెదవులు, నోరు, నాలుక, వాయునాళం తీవ్రంగా కాలిపోయాయి. దీని ఫలితంగా అంతర్గతంగా తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారిని వెంటనే సమీపంగా ఉన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యంత భయంకరమైన సంఘటన ఎదురైంది.

“చిన్నారికి గుండెపై డ్రెయిన్ క్లీనర్  తీవ్ర ప్రభావం పడింది.” అని నదీన్ గుర్తు చేసుకున్నారు. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్‌కు తరలించి చికిత్స అందించారని. ఆ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను,” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

శాశ్వత నష్టం, చికిత్స:

ఈ ప్రమాదం సామ్‌కు శాశ్వత నష్టాన్ని మిగిల్చింది. డ్రెయిన్ క్లీనర్ వల్ల చిన్నారి నోరు క్రమంగా మూసుకుపోవడం ప్రారంభమైంది. ఆహారం లేదా డ్రింక్స్ ఏవీ మింగకుండా చిన్న రంధ్రం మాత్రమే మిగిలి ఉంది. దీని కారణంగా.. డాక్టర్లు అతడి ముక్కు ద్వారా వచ్చే ఫీడింగ్ ట్యూబ్‌ను తొలగించి.. కడుపులోకి శాశ్వత ట్యూబ్‌ను అమర్చారు. చిన్నారి నోరు, నాలుక కాలిపోవడం వల్ల ఎప్పటికీ అతడు మాట్లాడలేడు.

కొంతమంది డాక్టర్లు సామ్‌కు శస్త్రచికిత్స సాధ్యమని చెప్పగా.. మరికొందరు గాయాల ఎక్కువగా ఉండటం వల్ల అతడు ఇక ముందు మాట్లాడే అవకాశం అస్సలు లేదని చెబుతున్నారు. విదేశాల్లో చికిత్స చేయించడానికి తగినంత డబ్బు లేకపోవడంతో కూడా ఈ నిస్సహాయ కుటుంబం తమ బిడ్డ ట్రీట్ మెంట్ కోసం గోఫండ్‌మీ (GoFundMe) ప్రచారాన్ని ప్రారంభించింది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×