E-Paper
Advertisement

Actress Radhika: మేకప్ కోసమే 7గంటలు.. ఈ నటి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే?

Actress Radhika: మేకప్ కోసమే 7గంటలు.. ఈ నటి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే?
Advertisement

Actress Radhika: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోలైన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వంటి వారితో మాత్రమే కాకుండా చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వంటి హీరోలతో కూడా సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటిగా ఎన్నో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రాధికా శరత్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్నారు.

రాధిక శరత్ కుమార్ తాయి కిళవి..

ఇక త్వరలోనే రాధిక నటించిన తాయి కిళవి(thaai kizhavi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు అయితే ఈ సినిమాలో రాధిక గుర్తుపట్టలేని విధంగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని చెప్పాలి. ఈ సినిమాలో డి గ్లామర్ పాత్రలో రాధిక శరత్ కుమార్ కనిపించబోతున్నారు ఇదివరకే ఈమె లుక్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాధిక శరత్ కుమార్ ఈ పాత్రలో నటించడం గురించి ఈ పాత్రకు ఆమె పడిన కష్టం గురించి తెలియజేశారు.

మేకప్ వేసుకోవడానికి 5 గంటలు..

Advertisement

ఈ సందర్భంగా రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర ‘పవునుతాయి’ కోసం ఏడు గంటల పాటు మేకప్ కోసం సమయం కేటాయించానని తెలిపారు. షూటింగ్ కు ముందు మేకప్ వేసుకోవడానికి తనకు 5 గంటల సమయం పట్టేది అలాగే ఈ మేకప్ తీసేయడానికి రెండు గంటల సమయం పట్టేదని ఇలా ప్రతిరోజు ఏడు గంటల పాటు మేకప్ కోసమే సమయం కేటాయించాల్సి వచ్చేదని రాధిక శరత్ కుమార్ తెలియచేశారు. ఈ విధంగా మేకప్ కోసం ఏడు గంటల పాటు సమయం కేటాయించడం అంటే మామూలుగా విషయం కాదు ఎంతో సహనం ఉంటే తప్ప ఇలాంటివి జరగవని ఈ విషయం తెలిసిన అభిమానులు ఈమె డేడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

75 ఏళ్ల వృద్ధిరాలి పాత్రలో..

Advertisement

శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.రాధికాతో పాటు సింగంపులి, అరుల్ దాస్, బాల శరవణన్, మునిష్కాంత్, ఇళవరసు వంటి నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రాధిక 75 ఏళ్ల వృద్ధిరాలి పాత్రలో కనిపించబోతున్నారు.పాషన్ స్టూడియోస్ మరియు శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా కామెడీ, డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి విభిన్నమైన గెటప్ లో రాధిక శరత్ కుమార్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది? ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె పలు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Also Read: Santosh Soban: పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళి దెబ్బలు తిన్న హీరో.. మర్చిపోలేనంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×