E-Paper
Advertisement

Renault February 2026 Offers: రెనాల్ట్ క్రేజీ ఆఫర్లు.. ఆ కార్లపై రూ. 73,500 తగ్గింపు, 3 ఏళ్ల ఫ్రీ సర్వీస్!

Renault February 2026 Offers:  రెనాల్ట్ క్రేజీ ఆఫర్లు.. ఆ కార్లపై రూ. 73,500 తగ్గింపు, 3 ఏళ్ల ఫ్రీ సర్వీస్!
Advertisement

ఫ్రెంచ్ ఆటో మోబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా ఫిబ్రవరి 2026కు సంబంధించి క్రేజీ ఆఫర్లను అందిస్తోంది. క్యాష్ ఆఫర్ తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, 3-సంవత్సరాల ఉచిత సర్వీస్ లాంటి ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఒకవేళ మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కోసం చూస్తున్నట్లయితే.. వెంటనే రెనాల్ట్ షోరూమ్‌ కు వెళ్లడం మంచిది. ఇంతకీ ఈ నెలలో రెనాల్ట్ ఇండియా అందిస్తున్న ఆఫర్లు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ రెనాల్ట్ కిగర్

ఫిబ్రవరి 2026లో రెనాల్ట్ ఎక్కువగా ఈ కారు మీదే తగ్గింపు అందిస్తుంది. కిగర్ కాంపాక్ట్ SUV రూ. 73,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ముఖ్యంగా టర్బో వేరియంట్లపై ఈ మొత్తాన్ని అందిస్తుంది. రెనాల్ట్ టర్బో మోడళ్లపై దాదాపు రూ. 48,500 నగదు, ఫైనాన్స్ ప్రయోజనాలను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌ లను కలిపితే మరో రూ.30,000 తగ్గుతుంది. అదే సమయంలో ఉచిత 3 సంవత్సరాల ఉచిత సర్వీసుకు సంబంధించి AMC స్కీమ్ ను తీసుకొచ్చింది.

⦿ రెనాల్ట్ ట్రైబర్

Advertisement

బడ్జెట్ ధరలో ఎక్కువ మంది ఇష్టపడే కారుగా రెనాల్ట్ ట్రైబర్ కొనసాగుతోంది. ఈ 7 సీటర్‌ కారుపై రూ.55,000 విలువైన ప్యాకేజీని అందిస్తుంది. ఇక హైలైట్ టెక్నో, ఎమోషన్ వేరియంట్లు. ఇవి గణనీయమైన నగదు తగ్గింపులను పొందుతాయి. ముఖ్యంగా 3 సంవత్సరాల ఉచిత(AMC) సర్వీసు వినియోగదారులను ఆకట్టుకోనుంది. సిటీలో ఎక్కువగా తిరిగే ఫ్యామిలీ కారు కోసం, కంపెనీ ద్వారా మూడు సంవత్సరాల సర్వీస్ పొందే అవకాశం కల్పిస్తోంది. చిన్న హ్యాచ్‌ బ్యాక్ నుంచి అప్‌ గ్రేడ్ చేస్తుంటే, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.

⦿ రెనాల్ట్ క్విడ్

చిన్న క్విడ్ మారుతి ఆల్టో K10 తో స్టైల్‌ లో పోటీ పడుతూనే ఉంది. ఈ నెలలో క్లైంబర్ వేరియంట్‌ ను కొనుగోలు చేయాలనుకుంటే దాదాపు రూ. 45,000 వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. నాన్ CNG క్విడ్ కూడా 3 సంవత్సరాల ఉచిత సర్వీసును(AMC) పొందుతుంది. తొలిసారి కారు కొనుగోలు చేసేవారికి, ఇది మంచి ఆఫర్ గా చెప్పుకోవచ్చు. మొదటి 36 నెలలకు ఎలాంటి ఖర్చులు లేకుండా సర్వీసింగ్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కారు యజమానికి ఖర్చు భారాన్ని తగ్గిస్తుంది. పాత టూ వీలర్, స్క్రాప్ చేయడానికి కారు ఉంటే, రెనాల్ట్ రిలైవ్ ప్రోగ్రామ్ కింది సుమారు రూ. 25,000 స్క్రాపేజ్ ప్రయోజనాన్ని అందిస్తుంది.

రెనాల్ట్ వ్యూహం కలిసి వచ్చేనా?

Advertisement

వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రెనాల్ట్ వ్యూహం ఉంది. తక్కువ ఖర్చు, నగదు తగ్గింపులతో పాటు AMC ప్యాకేజీని చేర్చడంతో చాలా మంది వినియోగదారులకు మేలు కలగనుంది. ఇక ఈ నెల ఆఫర్లలో భాగంగా కిగర్ టర్బో ఎక్కువ నగదు పొదుపును పొందుతుంది. కుటుంబ ప్రయాణాలకు ట్రైబర్ ను తీసుకోవడం మంచిది. ఫస్ట్ టైమ్ కారు కొనే వారికి క్విడ్ క్లైంబర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×