E-Paper
Advertisement

BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుల పరిస్థితి ఇది.. పార్లమెంట్ వేదికగా కేంద్రం ఏమని చెప్పిందంటే..?

BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుల పరిస్థితి ఇది.. పార్లమెంట్ వేదికగా కేంద్రం ఏమని చెప్పిందంటే..?
Advertisement

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ, అధికారిత శాఖ సహాయ మంత్రి బీపీఎల్ శర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రెండు వేర్వేరు బిల్లులు అందాయని, ప్రస్తుతం అవి రాష్ట్రపతి భవన్ పరిశీలనలో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో గత కొంతకాలంగా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య సాగుతున్న లేఖల యుద్ధంపై ఒక స్పష్టత వచ్చినట్లయింది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ కుల గణనతో పాటు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే.. కేంద్రం కావాలనే ఈ బిల్లులను తొక్కిపెడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా దక్కకుండా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడ్డుకుంటున్నారని ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ అధికార పక్షం జాతీయ స్థాయిలో పోరాటానికి దిగింది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు. మంత్రులు, కీలక నేతలు, ఎంపీలతో కలిసి కేంద్ర వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు బీజేపీ అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ గళమెత్తింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తడం, దానికి కేంద్రం పరిశీలనలో ఉంది అని సమాధానం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేంద్ర మంత్రి సమాధానం ప్రకారం.. బిల్లులు సాంకేతిక ప్రక్రియలో ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రాలు పంపే రిజర్వేషన్ల బిల్లులను కేంద్ర హోం శాఖ వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతుంది. అయితే ఈ జాప్యం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే.. అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా వివరణతో ఇప్పుడు బంతి రాష్ట్రపతి భవన్ కోర్టులో ఉందని స్పష్టమవుతోంది.

Advertisement

ALSO READ: Jeevan Reddy: సొంత పార్టీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×