E-Paper
Advertisement

Hyderabad Murder: సొంత అక్కనే నరికి చంపిన తమ్ముడు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!

Hyderabad Murder: సొంత అక్కనే నరికి చంపిన తమ్ముడు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!
Advertisement

Hyderabad Murder: హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. సొంత అక్క అని కూడా చూడకుండా తమ్ముడే ఆమెను కిరాతకంగా చంపి, మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేసిన ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.

బాటసింగారానికి చెందిన నీల అనే మహిళ భర్త కొన్నాళ్ల క్రితం మరణించడంతో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. అయితే, ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని తమ్ముడు పప్పు రామ్ ఆమెతో తరచూ గొడవ పడేవాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో.. ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 28న నీలను దారుణంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి సమీపంలోని మజీద్‌పురా చెరువులో పడేశాడు.

Advertisement

హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా పప్పు రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అక్క కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదని, కనిపించడం లేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, పప్పు రామ్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజం బయటపడింది. నిందితుడు చూపిన ఆనవాళ్ల ఆధారంగా మజీద్‌పురా చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు, నీల శరీర భాగాలను వెలికితీశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Also Read: కార్పొరేట్లకేనా రుణమాఫీ? అన్నదాతల మాటేమిటి? కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×