E-Paper
Advertisement

The Raja Saab: హైకోర్టుకు వెళ్లిన మన శంకర్ వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ సినిమాల నిర్మాతలు.. కారణం ఇదే!

The Raja Saab: హైకోర్టుకు వెళ్లిన మన శంకర్ వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ సినిమాల నిర్మాతలు.. కారణం ఇదే!
Advertisement

The Raja Saab: టాలీవుడ్‌లో సంక్రాంతి విడుదలలపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో పెద్ద హీరోల సినిమాలు రెండు ఉన్నాయి. ఒకటి చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు. మరొకటి ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్..

ఈ సమయంలో రాజాసాబ్.. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలకు సంబంధించిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రెండు చిత్రాల నిర్మాతలు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలకు ముందు టికెట్ ధరలు..ప్రత్యేక షోల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అభిమానులు, సినీ వర్గాల్లో ఈ విషయంపై ఆసక్తి పెరుగుతోంది.

Advertisement

సినిమా రిలీజ్ సమయానికి స్పెషల్ షోలు..టికెట్ ధరల పెంపు అనేవి నిర్మాతలకు చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలకు మొదటి కొన్ని రోజులు వచ్చే ఆదాయం చాలా ముఖ్యం. అందుకే నిర్మాతలు న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. హైకోర్టులో వేసిన పిటిషన్లు ఇప్పుడు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ది రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు టికెట్ ధరలు పెంచేందుకు..అలాగే ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అప్పీలు దాఖలు చేశారు. ఈ విషయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తమకు అనుకూలంగా లేవని నిర్మాతలు తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా ఇచ్చిన.. ఆదేశాలను సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా నిర్మాతలు కోర్టును కోరారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నందున.. వెంటనే ఈ పిటిషన్లను విచారణకు తీసుకోవాలని వారి తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు స్వీకరించలేదు.

నిర్మాతలు హోంశాఖ కార్యదర్శిని కూడా సంప్రదించినట్లు కోర్టుకు తెలియజేశారు. టికెట్ ధరల పెంపు..ప్రత్యేక షోల అనుమతిపై ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు వారు చెప్పారు. తమ దరఖాస్తును పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచనలు ఇవ్వాలని కూడా న్యాయస్థానాన్ని కోరారు.

ఈ పిటిషన్లను అత్యవసర విచారణ కింద తీసుకోవాలని అభ్యర్థించినా.. హైకోర్టు అందుకు అంగీకరించలేదు. అయితే నిర్మాతల పిటిషన్లపై రేపు విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు సినిమా టీమ్‌తో పాటు అభిమానులు కూడా కోర్టు తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టికెట్ ధరలు..ప్రత్యేక షోలపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు ఫలితం రాబోయే రోజులలో ఇతర సినిమాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ: Suresh Kumar: ప్రముఖ నటుడు సురేశ్ కుమార్ కన్నుమూత..శోక సంద్రంలో టాలీవుడ్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×