E-Paper
Advertisement

Psycho Thriller OTT : వింత రింగ్ పెట్టుకుని వేటాడే సైకో… ముసుగు వేసుకుని అమ్మాయిల మర్డర్స్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి భయ్యా

Psycho Thriller OTT : వింత రింగ్ పెట్టుకుని వేటాడే సైకో… ముసుగు వేసుకుని అమ్మాయిల మర్డర్స్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి భయ్యా
Advertisement

Psycho Thriller OTT : సైకో థ్రిల్లర్ సినిమాలలోనూ రకరకాల జానర్లు మిక్స్ అయ్యి ఉంటాయి. ముఖ్యంగా హర్రర్, క్రైమ్ వంటి జానర్లు కలిసి ఉన్న బ్రూటల్ మర్డర్, రివేంజ్ సీన్స్ తో గుండె దడ పెంచే అంశాలు ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ ఆద్యంతం ఇలాంటి సినిమాలు ఆసక్తికరంగా ఉంటాయి. మీరు కూడా ఇవన్నీ ఉన్న సైకో థ్రిల్లర్ గురించి వెతుకుతూ ఉంటే… ఈ మూవీ మీ కోసమే. మరి ఈ రివేంజ్ సైకో థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది ? ఆ మూవీ స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘సోరోరిటీ రో ‘ అనేది 2009లో విడుదలైన ఒక క్లాసిక్ ఎంటర్‌టైనర్. స్టీవర్ట్ హెండ్లర్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ థ్రిల్లర్ 1983 మూవీ ‘ది హౌస్ ఆన్ సోరోరిటీ రో’కి రీమేక్ గా రూపొందింది. జోష్ స్టోల్‌బర్గ్, పీట్ గోల్డ్‌ఫింగర్ స్క్రిప్ట్ రాసిన ఈ మూవీ 1 గంట 41 నిమిషాల రన్‌టైమ్ తో తెరకెక్కింది. కాకపోతే ఈ సినిమాలో చిన్నపిల్లలు చూడకూడని సీన్లు చాలానే ఉన్నాయి. కాబట్టి మూవీని చూసేటప్పుడు పిల్లలు లేకుండా చూసుకోండి. ఇక ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

బ్రియానా ఎవిగాన్ ఇందులో కాసిడీ అనే పాత్రలో నటించింది. జెసికా పాత్రలో లియా పైప్స్, ఎల్లీ రోల్ లో రూమర్ విల్లిస్, క్లైర్ పాత్రలో జామీ చుంగ్, చగ్స్ గా మార్గో హార్ష్‌మన్, మెగాన్ గా ఆడ్రినా ప్యాట్రిడ్జ్ నటించారు. ఈ మూవీలో వయొలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు.

Read Also : ఏకంగా 3 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డులు గెలుచుకున్న మలయాళం మూవీ… సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సోరోరిటీ హౌస్‌లోని సిస్టర్స్ చుట్టూ తిరుగుతుంది కథ. కాసిడీ, జెసికా, ఎల్లీ, క్లైర్, చగ్స్, మెగాన్ అనే నలుగురు సిస్టర్స్ ఉంటారు. మెగాన్ ను ఆమె బాయ్‌ఫ్రెండ్ గారెట్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన మిగతా సిస్టర్స్ వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంటారు. అందులో భాగంగా అందరూ కలిసి అతనిపై ప్రాంక్ ప్లాన్ చేస్తారు. మెగాన్ చనిపోయిందని చెప్పి గారెట్‌ ని భయపెడతారు. టైర్ ఐరన్‌ తో ఆమెను చంపినట్టు అతని ముందు నటిస్తారు. కానీ తీరా చూస్తే ప్రాంక్ ప్రాణాలు తీస్తుంది. సరదాగా చేసిన ఈ పని వల్ల మెగాన్ నిజంగా చనిపోతుంది.

దీంతో ఊహించని ఈ ఘటనకు మిగిలిన సిస్టర్స్ భయపడిపోతారు. ఆమె బాడీని డంప్ చేసి, విషయాన్ని అక్కడికక్కడే మర్చిపోవాలని అనుకుంటారు. ఆ తరువాత అంతా నార్మల్ అయిపోవడంతో మెగా చావు గురించిన సీక్రెట్ ను మర్చిపోతారు. అందరూ హ్యాపీ గా ఉంటారు. ఘటన జరిగిన 8 నెలల తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ పార్టీ జరుగుతుండగా… ఒక మాస్క్డ్ కిల్లర్ ఎంట్రీ ఇస్తాడు. ఆ సిస్టర్స్‌ని ఒక్కొక్కరు గా టార్గెట్ చేసి చంపుతాడు. ట్విస్ట్ ఏంటంటే… అచ్చం మెగాన్ చనిపోయినట్టే టైర్ ఐరన్ ఆయుధంగా యూజ్ వీళ్ళను కూడా చంపుతూ ఉంటాడు. అయినప్పటికీ తమ సీక్రెట్ బయట పడకుండా, ఈ సైకో నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. అసలు ఆ కిల్లర్ ఎవరు ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×