E-Paper
Advertisement

Film industry: 66 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఒక్క మాటతో క్లారిటీ!

Film industry: 66 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఒక్క మాటతో క్లారిటీ!
Advertisement

Film industry:సినీ ఇండ్రస్ట్రీలో రూమర్లు రావడం చాలా సాధారణం ఎంతో మంది ఎన్నోసార్లు ఇలాంటివి అనుభవించారు. కానీ కొన్నిసార్లు అవి ఎంత వింతగా ఉంటాయంటే విన్నవారికే ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా 66 ఏళ్ల సీనియర్ నటి నీనా గుప్తా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆమె ఈ వయసులో గర్భవతి అయ్యారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు షికారు చేశాయి. అయితే ఈ వార్తలపై నీనా గుప్తా ఎక్కడా అసహనం వ్యక్తం చేయకుండా, తనదైన శైలిలో హాస్యంతో కూడిన కౌంటర్ ఇచ్చి అందరి నోళ్లు మూయించారు. ఆ వివరాలు చూద్దాం..

విజయ్-రష్మిక రిసెప్షన్‌లో ఆ చీరలో అలా:

ఈ రూమర్లకు అసలు కారణం హైదరాబాద్‌లో జరిగిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వెడ్డింగ్ రిసెప్షన్. ఈ వేడుకకు హాజరైన నీనా గుప్తా ఒక అందమైన మందపాటి చీరను ధరించారు. అయితే ఆమె కట్టుకున్న తీరు, ఆ చీర మందం వల్ల ఫోటోలలో ఆమె పొట్ట కొంచెం పెద్దదిగా కనిపించింది. అంతే, నెటిజన్లు ఆ ఫోటోలను పట్టుకుని ఆమె 66 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్నారంటూ కథలు అల్లేశారు. పుకార్లు పుట్టించేసారు. ఇక ఈ వార్తలు కాస్త వైరల్ కావడంతో చివరకు ఆమె రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయటపెట్టాల్సి వచ్చింది.

నేను ప్రెగ్నెంట్ కాదు:

Advertisement

తనపై వస్తున్న పుకార్లపై నీనా గుప్తా స్పందిస్తూ.. తాను గర్భవతిని కాదని గట్టిగా చెప్పారు. “నేను ధరించిన ఆ మందపాటి చీర వల్లే ఫోటోలలో అలా కనిపించాను తప్ప, అంతకు మించి ఏమీ లేదు” అని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఈ వార్తలపై చమత్కరిస్తూ.. “నాకు కావలసింది కూడా ఇదే, నా నిజ జీవితానికి శుభాకాంక్షలు” అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఈ వయసులో కూడా తనపై ఇలాంటి వార్తలు వస్తున్నాయంటే మనం సమాజం దృష్టిలో ఎంతగా అభివృద్ధి చెందుతున్నామో అర్థమవుతోందని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ALSO READ:MSG Movie: బుల్లితెరపై కూడా తగ్గని జోరు.. మెగాస్టారా మజాకా?

రూమర్లకు చెక్ పెట్టిన సీనియర్ నటి ధైర్యం:

Advertisement

నీనా గుప్తా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం విషయంలో చాలా ఓపెన్‌గా ఉంటారు. గతంలో కూడా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను ధైర్యంగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఇక ఇప్పుడు కూడా తన వయసును, ఆరోగ్యాన్ని ఉద్దేశించి వచ్చిన వింత రూమర్లను ఆమె చాలా తెలివిగా తిప్పికొట్టారు. ఒక మహిళగా, నటిగా తనపై వచ్చే కామెంట్లను ఎలా డీల్ చేయాలో ఆమె మరోసారి నిరూపించారు. దీంతో ఆమె అభిమానులు కూడాసోషల్ మీడియాలో “నీనా మేడమ్ కౌంటర్ అదిరిపోయింది” అంటూ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×