// // Anushka Marriage: పెళ్లికి రెడీ అవుతున్న హీరోయిన్ అనుష్క‌!. -->
E-Paper
Advertisement

Anushka Marriage: పెళ్లికి రెడీ అవుతున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క‌!.. వరుడు ఎవరంటే?

Anushka Marriage: పెళ్లికి రెడీ అవుతున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క‌!.. వరుడు ఎవరంటే?
Advertisement

Anushka Marriage: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం ‘స్వీటీ’ అనుష్క శెట్టి వివాహం గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి. గత దశాబ్ద కాలంగా ఆమె పెళ్లి ఎప్పుడన్నది సినీ పరిశ్రమలో ఒక మిస్టరీగా మారగా, తాజాగా మరోసారి దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఆమె ఈ ఏడాదిలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సమాచారం ప్రకారం, అనుష్క ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతున్నారు. ఆయన ఆమె కుటుంబానికి ఎంతో కాలంగా సన్నిహితుడని, ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని ఈ సంబంధాన్ని ఖరారు చేశారని తెలుస్తోంది. వరుడు కర్ణాటకకు చెందిన వ్యక్తి అని, వ్యాపార రంగంలో మంచి గుర్తింపు ఉన్నవాడని తెలుస్తోంది. దీంతో ఎప్పటి నుంచో జేజమ్మ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.

Read also-Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ప్రీ సేల్స్ సునామీ మామూలుగా లేదుగా.. ఆ రికార్డ్ ఖాయం!

44 ఏళ్ల వయసులో కొత్త ప్రయాణం

Advertisement

ప్రస్తుతం అనుష్క వయసు 44 ఏళ్లు. వయసుతో సంబంధం లేకుండా తన నటనతో, హుందాతనంతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె, సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని గతంలో పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. చలా కాలం తర్వాత ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క సినిమా ఆసించినంత మేర ఆడకపోవడంతో నిరాశ చెందారు. తర్వాత ఆమె మీడియా ముందుకు రాలేదు.

Read also-Podarillu Today Episode : పురుషోత్తంకు షాకిచ్చిన పోలీసులు.. మహాను పొగిడిన నారాయణ.. గాయత్రికి దిమ్మతిరిగే షాక్..

వదంతులకు చెక్?

Advertisement

గతంలో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తాజా వార్తలు ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. అనుష్క తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడతారు, అందుకే పెళ్లి విషయంపై కూడా ఆమె ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారమే. అనుష్క లేదా ఆమె కుటుంబ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఏదీ ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతం అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనిని ఫుల్ స్టాప్ పెట్టాలంటే అధికారిక ప్రకటన్ రాావాల్సి ఉంది. అప్పటివరకూ ఆగాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×