E-Paper
Advertisement

Dharmapuri Arvind: కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు.. ఏమన్నారంటే..?

Dharmapuri Arvind: కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు.. ఏమన్నారంటే..?
Advertisement

Dharmapuri Arvind: కాంగ్రెస్‌కు రెండేళ్లలో డబ్బు సంపాదన కొవ్వుగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Aravindh) విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హౌస్ అరెస్టులతో డెమోక్రసీని తొక్కుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తోందన్నారు. సూపర్ మార్కెట్ యాజమాన్యం ఇష్టం వచ్చిన వారిని పనిలో పెట్టుకుంటారని, ఎవరో వచ్చి గొడవ చేశాడని, అమ్మాయిపై దౌర్జన్యం చేసింది ఓ ముస్లిం అయితే హిందువులను అరెస్టులు చేస్తారా? అని అర్వింద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read: Harvard University Invitation: హార్వర్డ్ వేదికపై రేవంత్ రెడ్డి.. భారత్ నుంచి తెలంగాణ‌ సీఎంకు మాత్రమే ఆహ్వానం!

సీఎంతో పాటు మంత్రులు కూడా..

Advertisement

సీఎం హిందువులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాటిపల్లిపై దాడి గురించి స్పీకర్ ఏమైనా ఆరా తీశారా? అని అర్వింద్ ప్రశ్నించారు. కనీసం వెంకటరమణారెడ్డికి స్పీకర్ కాల్ చేశారా? అని నిలదీశారు. ఎమ్మెల్యే రెస్పాన్సిబులిటి స్పీకర్ ది కాదా? అని ప్రశ్నించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని, శ్రీధర్ బాబు శ్రీధర్ బాబాగా, భట్టి విక్రమార్క.. అక్రమార్క లేదంటే భట్టి అక్రమ్ గా మార్చుకోవాలని సెటైర్లు వేశారు. కల్వకుంట్ల కుటుంబం ఇచ్చే డబ్బులు తిని వారిని కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని తన కూతురి పెళ్లికి లేకుండా చేసిన కుటుంబాన్ని ఇంకా జైల్లో ఎందుకు వేయడం లేదని అర్వింద్ ప్రశ్నించారు. సూపర్ మార్కెట్ లో గొడవ చేసిన వారిపై, అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి వచ్చిన వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Court Room Darama Series : బాస్ మీద వేధింపుల కేసు… కోర్టులో దద్దరిల్లే వాదనలు… ఓటీటీలోకి బెంగాలీ సిరీస్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×