E-Paper
Advertisement

Tollywood Hero: హిట్లు లేకపోయినా.. నిర్మాతను రూ. 18 కోట్లు అడిగిన హీరో.. ?

Tollywood Hero: హిట్లు లేకపోయినా.. నిర్మాతను రూ. 18 కోట్లు అడిగిన హీరో.. ?
Advertisement

Tollywood Hero: టికెట్ రేట్లు  పెరిగి ప్రేక్షకులు అందరూ ఐబొమ్మ లాంటివాటిపై ఆధారపడుతున్నా కూడా ఇండస్ట్రీలో హీరోలు మాత్రం మారడం లేదు. రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడం కానీ, బడ్జెట్స్ తగ్గించి చిన్న చిన్న సినిమాలు చేయడం కానీ చేయడం లేదు.  తాజాగా ఒక మిడ్ రేంజ్ హీరో.. తన రెమ్యూనరేషన్ ఏకంగా రూ18 కోట్లు అడిగి నిర్మాతనే బెంబేలెత్తించాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ హీరో గురించే చర్చ జరుగుతుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మిడ్ రేంజ్ హీరోకి కొన్నేళ్లుగా హిట్ అనేది లేదు.. పోనీ వరుస సినిమాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవి కూడా స్టార్ డైరెక్టర్స్ తో స్టార్ బ్యానర్ లోనే చేస్తున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం ఒక డైరెక్టర్.. ఒక నిర్మాతకు సదురు హీరోను రికమెండ్ చేశాడట. దీంతో నిర్మాత కూడా ఎంతో ఆనందంగా హీరోను కలిసి.. మాట్లాడాట. అయితే ఆ హీరో.. తనకు రూ. 18 కోట్లు రెమ్యూనరేషన్ గా కావాలని అడిగాడట. ఆ మాట వినడంతోనే నిర్మాతకు గొంతులో వెలక్కాయ పడినట్లు అయ్యిందంట. చేతిలో ఉన్నవి రెండు సినిమాలు.. కొన్నేళ్లుగా హిట్ లేదు.. ఈ మీటింగ్ కూడా ఒక డైరెక్టర్ రికమెండ్ చేస్తేనే వచ్చింది. అలాంటింది ఈ హీరో ఏంటి ఇంత అడుగుతున్నాడు అని షాక్ అయ్యాడట.

Advertisement

నిర్మాత తన బడ్జెట్ మొత్తం కలిపి 30 కోట్లు అనుకున్నాడట. అందులో ఒక 10 థియేటర్ నుంచి.. ఇంకో 15 నాన్ థియేటర్ నుంచి వస్తే.. 5 కోట్లు నష్టం వచ్చినా పెద్ద ఒరిగిదేమి లేదు అని లెక్కలు వేసుకొని వెళ్ళాడట. అక్కడకు వెళ్ళాక హీరో పారితోషికమే 18 కోట్లు అంటే సినిమా ఎంతలో తీయాలి.. మిగతావారికి ఎంత ఇవ్వాలి అని భయపడ్డాడట. దీంతో నువ్వు వద్దు.. నీతో సినిమా వద్దు అని నిర్మాత పారిపోయాడట.

ఇక ఈ మిడ్ రేంజ్ హీరో ఎవరు అని టాలీవుడ్ మొత్తం ఆరాలు తీయడం మొదలుపెట్టారు. రెండు సినిమాలు, హిట్లు లేవు అంటే విజయ్ దేవరకొండ అని కొందరు అంటున్నారు.  మరికొందరు శర్వానంద్ అని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది సాయి ధరమ్ తేజ్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్తపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఎన్ని జరిగినా కూడా ఈ టాలీవుడ్ మారాడు.  ఆ హీరోకు ఇచ్చే రెమ్యూనరేషన్ తో చిన్న సినిమాలు నాలుగు తీయొచ్చు. ఇలాంటివాళ్ల వలనే ఐ బొమ్మ, మోవి రూల్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×