E-Paper
Advertisement

Unclaimed Money: పాత బ్యాంకు ఖాతాల్లో డబ్బులు.. వడ్డీతో సహా తిరిగి ఎలా పొందాలంటే?

Unclaimed Money: పాత బ్యాంకు ఖాతాల్లో డబ్బులు.. వడ్డీతో సహా తిరిగి ఎలా పొందాలంటే?
Advertisement

Unclaimed Money: 2025 జూన్‌ నాటికి దేశంలోని బ్యాంకులలో రూ.67,000 కోట్లకు పైగా క్లెయిమ్‌ చేయని మొత్తాలు ఉన్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గుర్తించింది. పదేళ్లకు పైగా వాడకుండా ఉన్న ఖాతాల్లోని మొత్తాన్ని బ్యాంకులు ఆర్బీఐకు ట్రాన్స్ ఫర్ చేస్తాయి. ఈ డిపాజిట్లను తిరిగి ఖాతాదారులు పొందేందుకు అక్టోబరు 1న ఆర్బీఐ కొత్త స్కీమ్ ను ప్రారంభించింది. 2026 సెప్టెంబరు 30 వరకు ఇది పథకం అమలులో ఉంటుంది.

మరణించిన వారి పొదుపు/కరెంట్ అకౌంట్ లేదా టర్మ్ డిపాజిట్ ఖాతాల్లోని డబ్బులు ఏం అవుతున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే మీ అకౌంట్ చాలా రోజులు ఇన్ యాక్టివ్ గా ఉంటే.. మీ ఖాతాల్లోని డబ్బులు తిరిగి పొందడానికి మీరు ఏం చేయాలి? ఆ మొత్తాన్ని తిరిగి పొందవచ్చా? మీ ప్రశ్నలు ఆర్బీఐ తాజాగా సమాధానం చెప్పింది.

పాత బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులు

Advertisement

పాత బ్యాంకు ఖాతాలలో మరచిపోయిన డబ్బుకు తిరిగి పొందేందుకు ఓ పథకాన్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా పాత ఖాతాల్లో మిగిలిపోయిన మొత్తాల కోసం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2014లో “డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్” (DEA) నిధిని ఏర్పాటు చేసింది. 10 సంవత్సరాల పాటు నిర్వహించని పొదుపు లేదా కరెంట్ ఖాతాల్లో క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్‌లను “అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు”గా పేర్కొంది. ఈ డిపాజిట్లను వడ్డీతో తిరిగి పొందేందుకు క్లెయిమ్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది.

క్లెయిమ్ చేయని డిపాజిట్లను ట్రాక్ చేయడానికి ఆర్బీఐ UDGAM పోర్టల్ ను ప్రారంభించింది. UDGAM పోర్టల్ లో వాడకంలో లేని ఖాతాల్లోని డబ్బును అసలైన యజమానులు తిరిగి పొందడానికి ఆర్బీఐ అవకాశం కల్పిస్తుంది. అన్ క్లెయిమ్‌ ఖాతాల్లో డబ్బును పొందడానికి డిసెంబర్ 2025 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.

డీఈఏ నిధికి ఎప్పుడు జమ చేస్తారు?

Advertisement

10 సంవత్సరాలు పాటు యాక్టివ్ లేని లేదా క్లెయిన్ చేయని మొత్తాన్ని ఆర్బీఐ డీఈఏ ఖాతాలోకి నెల చివరి వర్కింగ్ డే నాడు బదిలీ చేయాలి. ఉదాహరణకు ఏప్రిల్ నెలలో డీఈఏ నిధికి (అంటే 10 సంవత్సరాలుగా క్లెయిమ్ చేయని) బదిలీ చేయవలసిన డిపాజిట్‌లను మే నెలలో చివరి పని రోజున DEA నిధికి బదిలీ చేయాలి.

ఆ ఖాతాల్లోని మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చా?

కస్టమర్/డిపాజిటర్ బ్యాంకు ఖాతాల్లోని మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. డిపాజిటర్ లేదా నామినీ లేదా వారసుడు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు వడ్డీతో పాటు తిరిగి చెల్లించాలి. వడ్డీ ఉన్న డిపాజిట్ ఖాతాలకు ఇది వస్తుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని ఆర్బీఐ డీఈఏ ఫండ్ నుంచి వాపసు కోసం బ్యాంక్ క్లెయిమ్ దాఖలు చేయాలి. https://udgam.rbi.org.in వెబ్ సైట్ లో క్లెయిమ్ చేయని మొత్తాన్ని తెలుసుకోవచ్చు.

క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఇలా తనిఖీ చేయండి

  • లావాదేవీలు నిలిచిపోయిన బ్యాంకు ఖాతాల వివరాలు అకౌంట్ హోల్డర్లు తెలుసుకునేందుకు ఆర్బీఐ https://udgam.rbi.org.in పోర్టల్‌ ప్రారంభించింది.
  • https://udgam.rbi.org.in పోర్టల్‌లో ఖాతాదారుడి పేరు, మొబైల్‌ నంబరుతో రిజిస్టర్‌ చేసుకోవాలి.
  • మరిన్ని వివరాలు అప్‌లోడ్‌ చేసి బ్యాంకుల్లో క్లెయిమ్‌ చేయని మొత్తాన్ని తెలుసుకోవచ్చు.
  • 2024 మార్చి 4 నాటికి 30 బ్యాంకుల వివరాలను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు.
  • క్లెయిమ్ చేయని మొత్తాన్ని తిరిగి పొందేందుకు మీ బ్యాంకుకు సంబంధించిన ఏదైనా శాఖను సందర్శించండి
  • KYC పత్రాలు సమర్పించండి (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ )
  • మీ డబ్బును తిరిగి పొందండి (వర్తిస్తే వడ్డీతో సహా)
  • క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ ప్రత్యేక శిబిరాలు: అక్టోబర్–డిసెంబర్ 2025

Also Read: EPFO: పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×