E-Paper
Advertisement

Surender Reddy : ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఏజెంట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్?

Surender Reddy : ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఏజెంట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్?
Advertisement

Surender Reddy : అతనొక్కడే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు సురేందర్ రెడ్డి. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా సక్సెస్ సాధించడంతో ఎన్టీఆర్ పట్టుపట్టి మరి అశోక్ సినిమా చేయించారు ఆ సినిమా ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. మొత్తానికి కిక్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి టాప్ డైరెక్టర్ అయిపోయాడు.

సురేందర్ రెడ్డి కెరియర్ లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. రామ్ చరణ్ హీరోగా చేసిన ధ్రువ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో సైరా నరసింహారెడ్డి అనే సినిమా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కంప్లీట్ డిజాస్టర్ అయిపోయింది.

రవితేజ తో సురేందర్ రెడ్డి 

Advertisement

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి కిక్ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ సినిమాలో రవితేజ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఒకవైపు ఫన్ తోపాటు ఎమోషనల్ గా కూడా ఆ సినిమాను అద్భుతంగా డీల్ చేశాడు సురేందర్ రెడ్డి.

వారిద్దరి కాంబినేషన్లో కిక్ 2 సినిమా వచ్చింది. అని ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని ఎప్పటినుంచో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది మరోసారి జరగబోతుంది. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ డేట్స్ ఉన్నాయి 

Advertisement

మరోవైపు పీపుల్ మీడియా నిర్మాణ సంస్థలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇద్దరు మెగా హీరోలకు సక్సెస్ ఇచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కు సినిమా చేసి మరో సక్సెస్ అందిస్తాడు సురేందర్ రెడ్డి అని నమ్ముతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారికి ప్రకటన రాలేదు.

ఒకవేళ సురేందర్ రెడ్డి పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా చేస్తే అది పవన్ కళ్యాణ్ తో చేస్తారా అని ఆలోచన కూడా చాలామందికి వస్తుంది.

Also Read: Mythri Ravi : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా టైటిల్ డ్రాగన్ కాదు, బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మైత్రి రవి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×