E-Paper
Advertisement

హ్యుందాయ్ నుంచి స్పెషల్ ఎడిషన్ SUV.. అదిరిపోయే ఫీచర్లతో వెన్యూ నైట్ లాంచ్!

హ్యుందాయ్ నుంచి స్పెషల్ ఎడిషన్ SUV.. అదిరిపోయే ఫీచర్లతో వెన్యూ నైట్ లాంచ్!
Advertisement

Hyundai Venue Knight Edition Launched:  భారత మార్కెట్లో కొత్తగా SUV అడుగు పెట్టింది. హ్యుందాయ్  వెన్యూ నైట్ ఎడిషన్ పేరుతో లాంచ్ అయ్యింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ ను ఆకట్టుకునే స్టైలింగ్, కొన్ని కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 9.70 లక్షలుగా నిర్ణయించింది. సాధారణ వెన్యూ మోడల్‌ తో పోలిస్తే, నైట్ ఎడిషన్ మరింత స్పోర్టీగా, స్టైలిష్‌ గా కనిపించేలా రూపొందించబడింది.

ఆకట్టుకునేలా క్రేజీ డిజైన్

ఈ కొత్త వెర్షన్‌ డిజైన్ పెద్ద ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మొత్తం కారు నలుపు రంగు థీమ్‌తో డిజైన్ చేయబడింది. ముందు గ్రిల్, స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రైల్స్, సైడ్ మిర్రర్లు, అల్లాయ్ వీల్స్ నలుపు రంగులో ఉంటాయి. అదనంగా, మ్యాట్ బ్లాక్ ఫినిష్‌ లో హ్యుందాయ్ లోగో, ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు, ‘నైట్’ అనే ప్రత్యేక బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు. ఈ మార్పులు కారుకు మరింత ఆకర్షణీయమైన, కొంచెం అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి.  రంగుల ఎంపికలో కూడా హ్యుందాయ్ కొత్తదనాన్ని తీసుకొచ్చింది. హేజల్ బ్లూ మ్యాట్, మిస్టిక్ సఫైర్ మ్యాట్ లాంటి కొత్త కలర్స్ ఈ ఎడిషన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించారు.

Advertisement

ఇక కారు లోపలి భాగంలో కూడా కొన్ని మార్పులు చేశారు. క్యాబిన్ మొత్తం డార్క్ థీమ్‌లో ఉంటుంది. నలుపు రంగుతో పాటు బ్రాస్ కలర్ టచ్‌ లు ఇవ్వడం ద్వారా ప్రీమియం ఫీల్ తీసుకువచ్చారు. సీట్ల డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండేలా కొత్త అప్‌హోల్స్టరీను ఉపయోగించారు. కారు లోపల ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.

ఆకట్టుకునేలా ఫీచర్లు

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ లైనప్‌ లో కొన్ని వేరియంట్లలో డాష్‌ క్యామ్‌ను కూడా చేర్చింది. ఇది డ్రైవింగ్ సమయంలో వీడియో రికార్డ్ చేయడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగపడుతుంది. అవసరమైతే వీడియోలను వెంటనే రికార్డ్ చేసి సేవ్ చేసుకునే విధంగా ఇందులో పలు పలు మోడ్స్ ఉన్నాయి. భద్రత పరంగా ఇదో క్రేజీ ఫీచర్ గా చెప్పుకోవచ్చు.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, వెన్యూ నైట్ ఎడిషన్ పలు ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్  DCT గేర్‌ బాక్స్‌, అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. వీటికి మాన్యువల్, ఆటోమేటిక్ గే ర్‌బాక్స్ ఆప్షన్లు కూడా లభిస్తాయి. దీంతో వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా వెన్యూ నైట్ ఎడిషన్ స్టైలింగ్, ఫీచర్ల పరంగా ప్రత్యేకంగా కనిపించే SUV. సాధారణ మోడల్‌కు భిన్నంగా, మరింత ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన రెనాల్ట్ డస్టర్‌, ఎన్ని పాయింట్స్ సాధించిందంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×