E-Paper
Advertisement

Tata Altroz CNG Mileage: టాటా ఆల్ట్రోజ్ CNG మైలేజ్ టెస్ట్, బాబోయ్.. అంతదూరం వెళ్లొచ్చా?

Tata Altroz CNG Mileage: టాటా ఆల్ట్రోజ్ CNG మైలేజ్ టెస్ట్, బాబోయ్.. అంతదూరం వెళ్లొచ్చా?
Advertisement

Tata Altroz CNG Mileage Test: టాటా మోటార్స్ సాధారణంగా తన కంపెనీకి చెందిన కార్ల మైలేజీ గురించి పెద్దగా ప్రకటనలు చేయదు. పెట్రోల్ తో నడిచే పాపులర్ మోడల్స్ అయిన హారియర్, సఫారీకి సంబంధించిన  ARAI సర్టిఫైడ్ మైలేజ్ వివరాలను కూడా కార్ల తయారీ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.  అప్ డేట్ చేయబడిన ఆల్ట్రోజ్ CNGకి సంబంధించిన మైలేజీ గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ మోడల్ కు చెందిన గత వెర్షన్ 26.2 కి.మీ క్లెయిమ్ చేయబడిన మైలేజీ తాజాగా పరీక్షల్లోనూ తేలింది. తాజాగా నిర్వహించిన రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ లో, ఆల్ట్రోజ్ CNG  సిటీలో 19.80 కి.మీ మైలేజీని అందించాయి. హైవేపై 34.58 కి.మీ సామర్థ్యాన్ని అందించింది. సరాసరి 27.19 కి.మీ మైలేజీని అంధిస్తున్నట్లు తాజా పరీక్షల్లో వెల్లడి అయ్యింది. ఆల్ట్రోజ్ హ్యాచ్‌ బ్యాక్ 1.2-లీటర్, NA పెట్రోల్ ఇంజిన్‌ తో ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్‌ తో వస్తుంది. CNG మోడ్‌ లో పవర్ అవుట్‌ పుట్ 72bhp, 103 Nm వరకు ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ CNG గురించి..  

Advertisement

దేశంలో అత్యంత సురక్షితమైన, ఫీచర్లతో కూడిన ప్రీమియం CNG హ్యాచ్‌ బ్యాక్ గా అదుబాటులోకి వచ్చింది. ఇది ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వచ్చి, మంచి బూట్ స్పేస్తో, చక్కటి మైలేజ్ ఇస్తుందట. ఇది నేరుగా CNG మోడ్‌ లో ప్రారంభమయ్యే సదుపాయాన్ని కలిగి ఉంది.

టాటా ఆల్ట్రోజ్ CNG కీ ఫీచర్లు  

టాటా ఆల్ట్రోజ్ CNG ట్విన్ సిలిండర్ ను కలిగి ఉంటుంది. సిలిండర్లను స్పేర్ వీల్ స్థానంలో అమర్చడం వల్ల డిక్కీలో తగినంత లగేజ్ స్పేస్ ఉంటుంది. ఈ కారు  XE, XM+, XZ, XZ+ (S) లాంటి పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.7.55 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఈ కారు టాప్ వేరియంట్ల ధర రూ. 10 లక్షలు దాటుతుంది.

Advertisement

ఇక ఈ కారుకు సంబంధించిన భద్రత,  ఫీచర్లను పరిశీలిస్తే, ఇది 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ పొందిన సురక్షితమైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఫీచర్లలో టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ అసిస్టెడ్ సన్‌ రూఫ్ ఉన్నాయి.

Read Also: అదిరిపోయే నిస్సాన్ కారు, ఇది ఏకంగా ఎండ నుంచే ఛార్జింగ్ అవుతుంది!

మార్కెట్ లో ఏ కార్లతో పోటీ పడుతుందంటే?  

టాటా ఆల్ట్రోజ్ CNG, మారుతి సుజుకి బాలెనో CNG, టయోటా గ్లాంజా CNG లాంటి కార్లకు మార్కెట్ లో గట్టి పోటీ ఇస్తుంది. మొత్తంగా ఈ కారు ప్రస్తుతం అత్యధిక మైలేజ్ ఇచ్చే టాటా కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: ఓకేసారి 5 కార్లు లాంచ్.. వోక్స్‌ వ్యాగన్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×