E-Paper
Advertisement

Rubbing Eyes: కళ్ళు నలుపుకుంటే ఎందుకు హాయిగా ఉంటుంది? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇదే!

Rubbing Eyes: కళ్ళు నలుపుకుంటే ఎందుకు హాయిగా ఉంటుంది? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇదే!
Advertisement

Rubbing Eyes: కళ్లను నలుపుకోవడం అనేది మనందరికీ తెలియకుండానే చేసే ఒక అలవాటు. అలసటగా ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు లేదా కంటిలో ఏదైనా నలక పడినప్పుడు కళ్ళను రుద్దడం వల్ల తక్షణమే ఎంతో హాయిగా, ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది. అయితే.. ఆ సమయంలో కలిగే ఆ ‘కిక్’ వెనక ఒక శాస్త్రీయ కారణం ఉంది. అదే సమయంలో.. ఈ చిన్న అలవాటు మీ కంటి చూపుకు ఎంత ప్రమాదకరమో తెలుసా ? కళ్ళు నలపడం వల్ల కలిగే ఆనందం వెనక ఉన్న రహస్యం, దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

కళ్ళు నలుపుకుంటే ఎందుకు హాయిగా ఉంటుంది?
మనం కళ్ళను నలిపినప్పుడు మనకు తెలియకుండానే ఒక శారీరక ప్రక్రియను ప్రేరేపిస్తాం. దీనిని “ఓక్యులోకార్డియాక్ రిఫ్లెక్స్” అంటారు.

Advertisement

మనం కనుగుడ్లపై స్వల్ప ఒత్తిడిని కలిగించినప్పుడు, అది మన శరీరంలోని వేగస్ నరమును ప్రేరేపిస్తుంది. ఈ నరం మెదడు నుంచి గుండె వరకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల మనకు తక్షణమే ప్రశాంతత, ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. అందుకే అలసటగా ఉన్నప్పుడు కళ్ళు నలుపుకోవడం మనకు తెలియకుండానే ఒక “రిలాక్సేషన్” పద్ధతిగా మారిపోయింది.

అంతేకాకుండా.. కళ్ళను రుద్దడం వల్ల కంటిలోని అశ్రు గ్రంధులు ప్రేరేపించబడి, కంటిలో తేమ పెరుగుతుంది. ఇది కంటిలోని దుమ్మును శుభ్రం చేయడానికి , కంటి పొడిబారడాన్ని తగ్గించడానికి తాత్కాలికంగా సహాయ పడుతుంది.

Advertisement

అది మీ కళ్ళకు ఏం చేస్తోంది?
ఆ క్షణానికి హాయిగా అనిపించినా, కళ్ళు రుద్దడం వల్ల జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది.

1. కనుగుడ్డు ఆకారం మారడం:
నిరంతరం కళ్ళను బలంగా రుద్దడం వల్ల కంటి ముందరి భాగం బలహీనపడి, పల్చగా మారుతుంది. ఇది కనుగుడ్డును గొడుగు ఆకారంలోకి మారుస్తుంది. దీనినే ‘కెరాటోకోనస్’ అంటారు. దీని వల్ల దృష్టి మందగిస్తుంది. అంతే కాకుండా భవిష్యత్తులో సర్జరీ అవసరపడవచ్చు.

2. ఇన్ఫెక్షన్ల ముప్పు:
మన చేతులు అనేక బ్యాక్టీరియా, వైరస్‌లకు నిలయాలు. చేతులతో కళ్ళను తాకినప్పుడు ఆ క్రిములు సులభంగా కంటిలోకి ప్రవేశించి కళ్లకలక వంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

3. రక్తనాళాలు చిట్లిపోవడం:
కంటి చుట్టూ ఉండే చర్మం , రక్తనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. బలంగా రుద్దడం వల్ల లోపల ఉండే చిన్న రక్తనాళాలు చిట్లిపోయి కళ్ళు ఎర్రబడతాయి. ఇది ముఖంపై ముడతలు అంతే కాకుండా కంటి కింద డార్క్ సర్కిల్స్ కు కారణమవుతుంది.

4. గ్లాకోమా ఉధృతి:
ఇప్పటికే గ్లాకోమా (కంటిలో ఒత్తిడి పెరగడం) ఉన్నవారు కళ్ళు రుద్దడం వల్ల ఆ ఒత్తిడి మరింత పెరిగి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఉపశమనం కోసం ఏం చేయాలి?
కోల్డ్ కంప్రెస్: కళ్ళు దురదగా ఉంటే.. చల్లటి నీటితో కడగడం లేదా ఐస్ ప్యాక్ ఉంచడం ఉత్తమం.

ఐ డ్రాప్స్: కళ్ళు పొడిబారినట్లు అనిపిస్తే.. డాక్టర్ సూచించిన లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వాడాలి.

రెప్పలు ఆర్పడం: కంప్యూటర్ చూసేటప్పుడు తరచుగా కనురెప్పలు ఆర్పడం వల్ల తేమ సహజంగా పెరుగుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×