E-Paper
Advertisement

Dhurandhar 2: విడుదలకు ముందే 25 కోట్లు.. ఇదేమి బీభత్సం రా బాబు..!

Dhurandhar 2: విడుదలకు ముందే 25 కోట్లు.. ఇదేమి బీభత్సం రా బాబు..!
Advertisement

Dhurandhar 2: ధురంధర్ సినిమా అనుకోకుండా బాలీవుడ్ లో ఎంతటి విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ సినిమా రెండో భాగం అన్ని భాషల్లో బీభత్సం సృష్టించడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్‌కు ముందే ఈ మూవీకి.. మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో ఈ చిత్రం వేగంగా దూసుకుపోతోంది.

ప్రీ బుకింగ్ హవా..!

ఈ సినిమా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే విడుదలకు ఒక రోజు ముందు, అంటే మార్చి 18న ప్రత్యేక ప్రివ్యూ షోలు కూడా ఏర్పాటు చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ ప్రివ్యూ షోలకే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. టికెట్లు విడుదలైన కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో బుక్ అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంది. యాక్షన్ సన్నివేశాలు, కథలోని ఉత్కంఠ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అందుకే చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు

ఏకంగా 25 కోట్లు..!

సినీ ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఇదే వేగం కొనసాగితే ప్రివ్యూ షోల ద్వారానే ఈ సినిమా సుమారు రూ.25 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉంది. గంటకు వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవుతున్నాయని సమాచారం. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Advertisement

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ అండర్‌కవర్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. కథలో అతను నేర ప్రపంచంలోకి ప్రవేశించి పెద్ద మిషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పాత్రలో అతని నటన ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది గతంలో విడుదలైన ధురంధర్ సినిమాకు కొనసాగింపుగా వస్తోంది. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించింది. అందుకే ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి.

రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 సినిమా మంచి హైప్‌ను సంపాదించింది. అడ్వాన్స్ బుకింగ్స్ వేగం చూస్తే, ఈ చిత్రం విడుదల రోజున కూడా భారీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ: Allu Sirish: అతన్ని నేను చూడలేదు.. కానీ ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు థాంక్స్.. అల్లు శిరీష్ ఎమోషనల్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×