E-Paper
Advertisement

Prabhas: రాజా సాబ్ హైప్ కోసం పెద్ద లెవెల్ ప్లాన్ వేసిన ప్రభాస్..!

Prabhas: రాజా సాబ్ హైప్ కోసం పెద్ద లెవెల్ ప్లాన్ వేసిన ప్రభాస్..!
Advertisement

Raja Saab Release Date: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ట్రైలర్‌కు ముందు వరకు సినిమాపై కొంతవరకు మాత్రమే హైప్ ఉండగా, ఇప్పుడు మాత్రం థియేటర్లలో పెద్ద పండగ రాబోతోంది అన్న రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రైలర్ లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పాలి. ట్రైలర్ తర్వాత సినిమాలో ప్రభాస్ ను వెండి తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ భుజాల మీదే నడుస్తుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. పెద్ద ఫాంటసీ ప్రపంచం, భారీ విజువల్స్, హారర్ కామెడీ ఎలిమెంట్స్ ఉన్నా వాటికంటే ప్రభాస్ ప్రెజెన్స్ వల్లే సినిమా ముందుకు నడవనుంది అనే ఫీలింగ్ ట్రైలర్ స్పష్టంగా ఇచ్చింది. ట్రైలర్ తర్వాత సినిమాకు వచ్చే ఆడియన్స్ నంబర్ కూడా ఇంకా భారీగానే పెరిగింది అని చెప్పచ్చు. ముఖ్యంగా ట్రైలర్‌లో కనిపించిన అమ్మమ్మ మనవడు ఎమోషనల్ బాండ్ కూడా చాలా మందిని ఆకర్షించింది. ఈ ఎమోషన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.

ప్రభాస్ పాత్ర అన్నిటికీ హైలెట్..

Advertisement

ప్రభాస్‌కు ఉన్న క్రాస్ జెనరేషన్ అప్పీల్ ఇక్కడ బాగా వర్క్ అవుతోంది. యంగ్ ఆడియన్స్‌తో పాటు పెద్దవాళ్లు కూడా ఈ సినిమాలో ఎమోషన్ కి కనెక్ట్ అవుతారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తానికి, రాజా సాబ్ ట్రైలర్ తో ప్రభాస్ ఈ సినిమాపై అంచనాలను వేరే స్థాయికి తీసుకెళ్లారు. ఫెస్టివల్ సీజన్‌లో విడుదల అవుతున్న సినిమా కావడంతో, థియేటర్ బజ్ ఇంకా ఎక్కువగా ఉండబోతోంది.

రాజా సాబ్ మామూలు సినిమా కాదు..

ది రాజా సాబ్ సాధారణ కమర్షియల్ సినిమా కాదు. హారర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ అన్నీ కలిపి కొత్తగా ట్రై చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ను ఒక డిఫరెంట్ అవతార్‌లో చూడబోతున్నాం. భారీ యాక్షన్ సినిమాల తర్వాత, ప్రభాస్ చాలా రోజులకి మళ్ళీ సరదాగా ఎంటర్‌టైన్ చేసే పాత్రలో కనిపించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్‌గా మారింది.

Advertisement

సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా, నిధ్ధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరినా వాహబ్ లాంటి నటులు సినిమాకు మంచి వెయిట్ తీసుకొస్తున్నారు. థమన్ అందిస్తున్న పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ఎనర్జీ ఇస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మ్యూజిక్‌పై పాజిటివ్ టాక్ మొదలైంది. జనవరి 9, 2026న రిలీజ్ ఫిక్స్ కావడంతో, సంక్రాంతి రేస్‌కు ముందే రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది.

ALSO READ: Prabhas vs Thalapathy Vijay: విజయ్ సినిమాకు తెలుగు థియేటర్లు ఫుల్… ప్రభాస్‌కు తమిళ మార్కెట్ క్లోజ్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×