E-Paper
Advertisement

Holi Beauty Care: హోలీకి ముందు ముఖానికి ఈ నూనె రాస్తే రంగులు చర్మానికి అతుక్కోవు

Holi Beauty Care: హోలీకి ముందు ముఖానికి ఈ నూనె రాస్తే రంగులు చర్మానికి అతుక్కోవు
Advertisement

రంగుల పండుగ హోలీ. ఈ పండుగంటే చిన్నా, పెద్దా అందరికీ ఎంతో ఇష్టం. రంగులు చల్లుకుంటూ కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అయితే హోలీ రోజు ఉపయోగించే రంగులు కొన్నిసార్లు చర్మానికి ఇబ్బంది కలిగిస్తాయి. రంగు ముఖానికి పట్టిన తర్వాత తొలగించుకోవడం కష్టం అవుతుంది. కొందరికి దురద, ఎర్రదనం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి హోలీకి ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ముఖానికి, శరీరానికి నూనె రాయడం చాలా ఉపయోగకరం.

నూనె రాస్తే ఏమి జరుగుతుంది?
హోలీ రంగుల్లో కొన్నిసార్లు రసాయనాలు ఉంటాయి. అవి చర్మంపై ఎక్కువసేపు ఉంటే చర్మంలోకి లోతుగా వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో అలర్జీ లేదా పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. కానీ హోలీకి వెళ్లే ముందు చర్మంపై నూనె రాస్తే అది ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. నూనె ఉండటం వల్ల రంగు నేరుగా చర్మంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. అలాగే రంగు పడినా తర్వాత సులభంగా తొలగించుకోవచ్చు. అందుకే హోలీకి ముందు నూనె రాయడం మంచి అలవాటు అంటున్నారు.

Advertisement

ఏ నూనె రాయాలి?
హోలీకి ముందు ప్రత్యేకంగా ఖరీదైన క్రీములు అవసరం లేదు. ఇంట్లో ఉన్న సాధారణ నూనెలే సరిపోతాయి. ముఖానికి ఇంట్లో ఉన్న కొబ్బరినూనె రాసుకోవచ్చు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కొబ్బరి నూనె రాస్తే రంగు ఎక్కువగా అంటకుండా ఉండే అవకాశం ఉంటుంది. చర్మానికి పోషకాలు అందించే బాదం నూనె కూడా మంచి ఎంపిక. ఇది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి నువ్వుల నూనె ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.ఈ మూడు నూనెల్లో ఏదైనా ఒకటి రాసినా సరిపోతుంది. ముఖ్యంగా కొంచెం ఎక్కువ రాయడం మంచిది.

ఎలా రాయాలి?
హోలీ ఆడటానికి కనీసం అరగంట ముందు నూనె రాయాలి. ముఖం, మెడ, చేతులు, కాళ్ల.. ఇలా బయట కనిపించే భాగాలన్నింటికీ రాయాలి. చెవుల వెనుక, ముక్కు పక్కలు, మోచేతులు వంటి భాగాలను కూడా మర్చిపోవద్దు. ఈ ప్రాంతాల్లో రంగు ఎక్కువగా నిలిచిపోతుంది. ముందుగానే నూనె రాస్తే తర్వాత ఇబ్బంది తక్కువగా ఉంటుంది.

Advertisement

జుట్టుకూ రక్షణ అవసరం
హోలీ రోజు చర్మం మాత్రమే కాదు జుట్టు కూడా దెబ్బతింటుంది. రంగులు జుట్టులో పడితే పొడిబారడం, రఫ్‌గా మారడం జరుగుతుంది. అందుకే జుట్టుకు కూడా నూనె రాయాలి. కొబ్బరి లేదా బాదం నూనె రాసి జడ వేసుకోవడం లేదా జుట్టును కట్టుకోవడం మంచిది. ఇలా చేస్తే రంగు వెంట్రుకల్లో ఎక్కువగా పట్టదు.హోలీ ముగిసిన వెంటనే బలంగా సబ్బుతో ముఖాన్ని రుద్దడం మంచిది కాదు. ముందుగా కొద్దిగా నూనె తీసుకుని ముఖం, చేతులకు మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పైపై రంగు పోతుంది. తరువాత మృదువైన ఫేస్‌వాష్ లేదా సబ్బుతో కడిగితే చర్మానికి హాని కలగకుండా ఉంటుంది. అలాగే ఒకేసారి పూర్తిగా రంగు తొలగకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజుల్లో సహజంగా పోతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×