E-Paper
Advertisement

Best Electric Scooter: ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. క్రేజీ లుక్, అదిరిపోయే మైలేజ్!

Best Electric Scooter: ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. క్రేజీ లుక్, అదిరిపోయే మైలేజ్!
Advertisement

India’s Best EV Scooter 2026: ఇండియన్ మార్కెట్ లో పలు బ్రాండ్స్ కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు సత్తా చాటుతున్నాయి. చక్కటి లుక్ తో పాటు మంచి రేంజ్ తో ఆకట్టుకుంటున్నాయి. అయితే, అన్నింటి కంటే అమ్మకాల్లో సత్తా చాటుతున్న మోడల్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఆధునిక ఫీచర్లతో క్లాసిక్ డిజైన్‌ను మిక్స్ చేసిన తీసుకొచ్చిన ఈ స్కూటర్ ప్రీమియం ఈవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్కూటర్ 3 kWh, 3.5 kWh బ్యాటరీ ఆప్షన్లతో ఒకే ఛార్జ్ తో సుమారు 127 నుంచి 153 కి.మీల వరకు ప్రయాణాన్ని అందిస్తుంది. సుమారు 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఈ స్కూటర్ గంటకు 63 నుంచి 73 కి.మీల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

అమ్మకాల్లో చేతక్ దూకుడు 

2025తో పాటు 2026 ప్రారంభంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి.  జనవరిలో 28,216 యూనిట్ల విక్రయాలతో 34% వృద్ధిని సాధించింది. ఫిబ్రవరి 2026లో 22,942 వాహనాల రిజిస్ట్రేషన్లతో మార్కెట్లో 22.7% వాటాతో రెండవ స్థానంలో నిలిచింది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు,  ధర

Advertisement

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్  కొత్త వేరియంట్ల ధర రూ. 1,02,734 నుంచి రూ. 1,34,745 వరకు ఉంటుంది. 2026లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా టీవీఎస్ ఐక్యూబ్‌ తో గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ 3001, 3501 ప్రీమియం వేరియంట్లలో అందుబాటులో ఉంది.  బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటల్ బాడీఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్, 35 లీటర్ల బూట్ స్పేస్, డిజిటల్ కన్సోల్, బ్లూ టూత్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, వేగం

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3001 మోడల్ 127 కి.మీ రేంజ్, 63 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3501 మోడల్ 153 కి.మీ రేంజ్, 73 గరిష్ట వేగంతో వస్తుంది.ఈ స్కూటర్ లో Li-ion బ్యాటరీ ఉంటుంది. 650W పోర్టబుల్ ఛార్జర్‌ తో 20-80% ఛార్జింగ్ కు సుమారు 2.5 నుంచి 3.5 గంటలు పడుతుంది. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదంటే  50,000 కి.మీల వరకు వారంటీ అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: వచ్చే ఏడాది నెక్ట్స్ ఈవీ లాంచ్.. కీలక ప్రకటన చేసిన మహీంద్రా!

ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఇక బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటల్ స్ట్రాంగ్ మెటల్ బాడీతో వస్తుంది. సీటు కింద 35 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.  రివర్స్ మోడ్ పార్కింగ్ ను సులభతరం చేస్తుంది. బజాజ్ చేతక్  స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు కోరుకునే వారికి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: వచ్చే ఏడాది నెక్ట్స్ ఈవీ లాంచ్.. కీలక ప్రకటన చేసిన మహీంద్రా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×