E-Paper
Advertisement

Breathing Difficulties : శ్వాస తీసుకునే విధానం బట్టి ఆరోగ్య సమస్యలు గుర్తింపు..

Breathing Difficulties : శ్వాస తీసుకునే విధానం బట్టి ఆరోగ్య సమస్యలు గుర్తింపు..
Advertisement

Breathing Difficulties : మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా కావాల్సింది ఊపిరి పీల్చుకోవడం. ఇక వారి ఇష్టానికి తగినట్టుగా ఆహారాన్ని తీసుకోవడం, నిద్ర, నీరు.. ఇలాంటివన్నీ శ్వాస తర్వాతే వస్తాయి. ఆ శ్వాసే మనిషిని బ్రతికిస్తుంది. అలా అని మనుషులు అందరూ ఒకేలా శ్వాస తీసుకోరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా శ్వాస తీసుకుంటారని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయితే ఈ శ్వాస తీసుకునే విధానం వారిలో ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా బయటపెడుతుందని ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు.

Advertisement

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తున్నాయి. ఇందులో చాలావరకు సమస్యలు అంత ప్రాణాంతకమైనవి కాకపోయినా కూడా కొన్ని మాత్రం పలు సందర్భాల్లో మనుషులకు ప్రాణహాని కలిగించే స్థాయికి చేరుకుంటాయి. అందుకే మనిషి ఊపిరి పీల్చుకునే విధాన్ని స్టడీ చేయడం వల్ల వారి శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాంటి పద్ధతిని కూడా వారు తాజాగా కనుగొన్నారు.

డైసెప్సియా, గ్యాస్ట్రిటిస్.. ఇలాంటి ఎన్నో గ్యాస్ట్రిక్ సమస్యలను కనిపెట్టడానికి శ్వాస పీల్చుకునే పద్ధతిని గమనిస్తే చాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముందుగా పెప్టిక్ అల్సర్ ఉన్నవారు ఎలాంటి శ్వాసను తీసుకుంటారు అనే విషయంపై ప్రయోగాలు జరిగాయి. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో మిగిలిన గ్యాస్ట్రిక్ సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ పద్ధతిని ఉపయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వారు సేకరిస్తున్న ఈ శ్వాస సంబంధిత సమాచారాన్ని బ్రెథొమిక్స్ డేటా అంటారని వారు తెలిపారు.

Advertisement

బ్రెథొమిక్స్ డేటా అనేది మనిషి వదులుతున్న శ్వాసకు సంబంధించిన సమాచారాన్ని కలెక్ట్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనిషి వయసు, జెండర్, లైఫ్‌స్టైల్.. లాంటి వాటికి, బ్రెథొమిక్స్ సమాచారానికి ఏ మాత్రం సంబంధం ఉండదని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెప్టిక్ అల్సర్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో.. దీని గురించి తెలుసుకోవడానికి ముఖ్యంగా ఈ పద్ధతిని కనుక్కున్నట్టుగా శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీనికోసం వారు ‘పైరో బ్రీథ్’ అనే మెషిన్‌ను కూడా కనిపెట్టారు. ప్రస్తుతం పలు ఆసుపత్రులలో ఈ మెషీన్ అందుబాటులో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×