E-Paper
Advertisement

Revanth Reddy: కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు.. ధరణిపై రేవంత్ వార్నింగ్

Revanth Reddy: కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు.. ధరణిపై రేవంత్ వార్నింగ్
Advertisement

Revanth Reddy Latest News(Telangana politics): కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు.. కేసీఆర్ కుటుంబం మొత్తానికి జైళ్లో ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామంటూ హాట్ కామెంట్ చేశారు రేవంత్.

ధరణి పోర్టల్ తీసుకొచ్చి వేల ఎకరాల దోపిడీ చేశారని సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు పంచిన భూములు రికార్డులు లేకుండా చేశారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్ని మాట్లాడినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామన్నారు.

Advertisement

ధరణి పోర్టల్ రద్దు చేస్తే.. రైతు బంధు ఆగిపోతుందనేది కేవలం విష ప్రచారం మాత్రమేనని రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్ రాకముందు రైతు బంధు అందలేదా? అని ప్రశ్నించారు.

అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్. కాంగ్రెస్ హయాంలోని పథకాలకు పేర్లు మార్చి పాలన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కార్.. కొత్తగా ఒక్క పథకం కూడా తీసుకురాలేదన్నారు.

Advertisement

సీఎం కేసీఆర్, పీఎం మోదీపై సెటైర్లు విసిరారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ పనికిరాని వెయ్యి రూపాయల నోటు లాంటోడని.. మోదీ వాపస్ తీసుకున్న 2వేల నోటు లాంటి వాడని పంచ్‌లు వేశారు. వారిద్దరితో దేశానికి కానీ.. రాష్ట్రానికి కానీ ఎలాంటి ప్రయోజం లేదన్నారు.

యూత్ కాంగ్రెస్ లో కష్టపడే వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారని రేవంత్ అన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు కలిసి కష్టపడితే.. కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని తెలిపారు. మానిక్ రావు ఠాక్రే సైతం యూత్ కాంగ్రెస్ నుంచే ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×