E-Paper
Advertisement

Finger Millet Benefits: రాగులతో ఈ అనారోగ్య సమస్యలు పరార్ !

Finger Millet Benefits: రాగులతో ఈ అనారోగ్య సమస్యలు పరార్ !
Advertisement

Finger Millet Benefits: ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా జనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పాత కాలంలో 100 ఏళ్లు ఆరోగ్యంగా బత్రికే వారు లేకపోలేదు. కానీ ప్రస్తుతం 60 ఏళ్లు బ్రతకడమే కష్టంగా మారింది. అప్పట్లో వారు తిన్న ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైనవి. పాత కాలంలో తృణ ధాన్యాలను ఎక్కువగా తినేవారు. అందుకే తిరిగి పాతకాలం నాటి ఆహార పదార్థాలను ప్రస్తుతం తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఎంతోమంది ఇప్పుడు ఏరి కోరి తృణధాన్యాల తింటున్నారు. తృణ ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. వీనిని పేదవాడి ఆహారంగా చెబుతుంటారు. కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

ఫైబర్ కూడా రాగుల్లో పుష్కలంగా ఉంటుంది. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. రాగి పిండితో జావా లేదా దోసెల లాంటివి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుని తినవచ్చు. బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. రాగులను రోజువారి డైట్‌లో భాగంగా చేర్చుకోవడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

బరువు తగ్గడం:
రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అతిగా తినకుండా కూడా ఆపుతుంది. చాలా సేపు వరకు కడుపు నిండుగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఊబకాయ సమస్యతో బాధపడేవారు రాగులను తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరం ఫిట్ గా ఉండాలనుకునే వారు కూడా రాగులను తినడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యం:
మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. రాగుల్లో ఉండే ఇతర పోషకాలు కాలేయంలో కొవ్వు పేరుకు పోకుండా అడ్డుకుంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా నిరోధిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

డయాబెటిస్ నివారణి:
రాగులు తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతున్నానని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ఫలితంగా మధుమేహం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

Also Read: ఒత్తిడిని తగ్గించే ఫుడ్ ఇదే !

జీర్ణ క్రియ:
రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. అరుగుదల సమస్యలు, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలను నయం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు రాగులు దూరం చేస్తాయి.

ఎముకలకు బలం:
రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. రాగులు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రాగి జావ లేదా రాగితో తయారు చేసిన ఆహార పదార్థాలు తరచుగా తీసుకోవడం వల్ల ఎముకల్లో బలం పెరుగుతుంది. బోలు ఎముకలు లాంటి వ్యాధుల నుంచి కూడా ఇవి దూరం చేస్తాయి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు ఎంతో ఉపయోగపడతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×