E-Paper
Advertisement

మామిడిపండ్లతో 5 రకాల టేస్టీ డ్రింక్స్ ఇలా తయారు చేయండి.. వేసవిలో సూపర్ మజా..

మామిడిపండ్లతో 5 రకాల టేస్టీ డ్రింక్స్ ఇలా తయారు చేయండి.. వేసవిలో సూపర్ మజా..
Advertisement

Mango Fruit Drinks| పండ్లలో రాజుగా మామిడికి ప్రత్యేక హోదా ఉంది. వేసవిలో ఈ పండు సీజన్ ప్రారంభం కాగానే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీయగా, జ్యూసీగా.. పోషకాలతో నిండి ఉంటుంది. వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లగా, తాజాగా ఉంచడంలో మ్యాంగో డ్రింక్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ డ్రింక్స్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అన్ని వయసుల వారికి ఆస్వాదిస్తారు.

వేసవి స్పెషల్ మ్యాంగో డ్రింక్స్

మ్యాంగో డ్రింక్స్ రుచికరంగా ఉండడంతో పాటు శరీరానికి చల్లదనం, ఎనర్జీనిస్తాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి, విటమిన్లు యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. వేసవిలో మ్యాంగో డ్రింక్స్ తాగితే తాజాగా, చురుగ్గా ఉంటారు.

మ్యాంగో లస్సీ

Advertisement

భారతదేశంలో మ్యాంగో లస్సీ చాలా ఫేమస్. పండిన మామిడి, పెరుగు, చక్కెర కలిపి బ్లెండ్ చేస్తే చిక్కగా, క్రీమీగా వస్తుంది. తాగడానికి చల్లగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. పెరుగు వేయడల వల్ల జీర్ణక్రియకు కూడా మంచిది.

ఆమ్ పన్నా.. ఒక పుల్లని, చల్లని పానీయం

ఆమ్ పన్నా పచ్చిమామిడితో చేస్తారు. అందుకే ఈ డ్రింక్ పుల్లగా, కొద్దిగా కారంగా ఉంటుంది. పుదీనా, నల్ల ఉప్పు, జీలకర్ర వేయండి. శరీరంలో వేడిని తగ్గించి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. తీవ్రమైన ఎండలో చాలామంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్ పన్నా తాగడానికి ప్రజలు ఇష్టపడతారు.

మ్యాంగో షేక్.. తక్షణ ఎనర్జీ కోసం

Advertisement

మ్యాంగో షేక్ చాలా సింపుల్. మామిడి గుజ్జు, పాలు, చక్కెర కలిపి బ్లెండ్ చేస్తే చాలు. దీన్ని తాగగానే మృదువుగా, తియ్యగా, కడుపు నిండుగా ఉంటుంది. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం తాగడానికి చాలా మంచిది. తక్షణ శక్తినిస్తుంది.

మ్యాంగో స్మూతీ

మ్యాంగో షేక్ కంటే స్మూతీ ఆరోగ్యకరమైనది. మామిడితో పాటు పెరుగు లేదా పాలు, తేనె వేయండి. అరటి, పైనాపిల్ వంటి పండ్లు కూడా కలపొచ్చు. దీంతో తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. ఆరోగ్య ప్రియులకు స్మూతీ చాలా మంచి ఆప్షన్.

మ్యాంగో లెమన్ జ్యూస్.. రిఫ్రెష్ ట్విస్ట్

ఇందులో మామిడి గుజ్జు, నిమ్మరసం, నీళ్లు కలుపుతారు. దీని రుచి తియ్యగా, పుల్లగా ఉంటుంది. మధ్యాహ్నం వాతావరణం వేడిగా ఉన్న సమయంలో ఇది చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. పుదీనా లేదా మంచు ముక్కలు వేస్తే మరింత చల్లగా ఉంటుంది.

Also Read: భారీతీయ మహిళల్లో చీర క్యాన్సర్ ముప్పు.. ఈ ఒక్క తప్పు వల్లే ఆరోగ్యానికి ప్రమాదం

మ్యాంగో మొజిటో.. లేటెస్ట్ సమ్మర్ డ్రింక్

మ్యాంగో మొజిటో ఇటీవలి కాలంలో ట్రెండింగ్‌లో ఉంది. తాగితే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. మామిడి, పుదీనా, నిమ్మరసం, సోడా కలుపుతారు. చాలా లైట్ డ్రింక్. సోడా కలపడంతో బుడగలుగా ఉంటుంది. వేసవి పార్టీలకు ఇది సరైన డ్రింక్. సాంప్రదాయ మ్యాంగో డ్రింక్‌లకు ఇది ఒక ఆధునిక ట్విస్ట్.

మ్యాంగో డ్రింక్స్ సురక్షితంగా ఎలా ఆస్వాదించాలి?

ఎప్పుడూ తాజా, పండిన మామిడి ఉపయోగించండి. ఎక్కువ తీపింగా ఉండే సిరప్ డ్రింక్స్, ఫ్రేవర్ డ్రింక్స్ కలపకూడదు. మామిడిలో ఎక్కువ పోషకాలు ఉండడంతో ఇది ఒక పవర్ ఫ్రూట్. అయితే మరీ హెవీగా తీసుకోకూడదు. ఇంట్లోనే తాజా పదార్థాలు కలిపి మీ సొంత మ్యాంగో డ్రింక్ తయారు చేసుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×